భ్రమర కీటక న్యాయం

Shirdi Saibaba
Shirdi Saibaba

భ్రమర కీటక న్యాయం

సాయిబాబా కొద్దిమందిని మాత్రమే తన రంగస్థలమయిన షిరిడీకి పిలిపించుకున్నారు. దాదాపు వారందరూ సాయిచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ లీల సాయిబాబా మహాసమాధి అనంతరం కూడా కొనసాగింది. అలా పిలిపించుకున్న వారితో స్వామీజీ శివనేశన్‌ స్వామి ఒకరు. 1927 ఏప్రియల్‌ 12వతేదీన జన్మించిన స్వామీజీకి మొదటి నుండి దైవభక్తి వ్ఞండేది. ముత్తయ్యగారు స్వామీజీ గురువ్ఞ. స్వామీజీకి గణేశ్‌పురి నిత్యానందుల వారి, త్య్రంబకంలోని మౌనిబాబా ఆశీర్వచనాలు దొరికాయి. ఒక ఫకీర్‌ ”షిరిడీకిరాఅని ఆజ్ఞాపించారు స్వామీజీని గురువ్ఞ గారు అనుమతించారు.

కాలినడకన బయలుదేరారు. మరల కొద్ది రోజులకు ‘నీవ్ఞ త్వరగా షిరిడీకి రా అన్నాడు ఫకీరు. దారిలో నున్న మౌనిబాబా ఆశ్రమంలో స్వామీజీ వ్ఞంటే స్వప్నంలో ఒక వ్యక్తి దర్శనమిచ్చి ”నిన్ను షిరిడీ రమ్మంటే ఇక్కడెందుకున్నావ్ఞ?” అని గద్దించి అడిగాడు. కాలయాపన చేయకుండా 1953 శ్రీరామనవమి ఉత్సవముల అనంతరం షిరిడీ చేరిన స్వామీజీ ఒకటి రెండుసార్లు మినహా తాను సమాధి చెందే వరకు (12.2.1996) అక్కడే వ్ఞండిపోయారు. కట్టుకున్న గుడ్డలు తప్ప వేరే ఆస్తిపాస్తులు లేని ఒక సామాన్య వ్యక్తిగా షిరిడీలో కాలుపెట్టిన శ్రీశివనేశన్‌ స్వామీజీ ఒక గురువ్ఞగా గౌరవింపబడ్డారు.

ఒక కీటకం భ్రమరమయింది. మహల్సాపతికి ఉన్న నిర్వ్యామోహత్వం ధూమల్‌ అచంచల విశ్వాసం, బయజాబాయి సోదరప్రేమ, దాసగణు సంకీర్తనా ప్రాభవము, కాకాసాహెబ్‌ సద్గంధ్ర పఠన, పారాయణము, సావిత్రీ రఘునాథ్‌ టెండూల్కర్ల సాయి సాహిత్య ప్రేమ, బీ.వి.నరసింహస్వామి, సాయి ప్రచారము. స్వామి కేశవయ్యజీ ఊది మహత్వ వితరణ, నిరూపణ, సాయిశరణానంత సాయితత్వం పరిజ్ఞానము ఇలా ఎందరెందరి సాయి భక్తుల ప్రతిభాపాటవాలు ఆయనలో చోటుచేసుకున్నాయో ఊహించలేము. సాయిబాబాను నాలుగున్నర దశాబ్దాలు, రోజుకున్న 24గంటలలో 20గంటలపైబడి నిస్వార్ధంగా, త్రికరణ శుద్ధిగా సేవించి తరించిన మహనీయుడు శివనేశన్‌స్వామి. ఆయనను షిరిడీ సాయి సంస్థాన్‌ వారు సాయిబాబాకు సమర్పించిన ప్రసాదాన్ని ప్రతిదినం అందజేసేవారు. అది సాయి భగవానుని కృపకు ఉదాహరణ. ఆ కృప వలన అలవడ్డ మహిమ లను స్వప్రయోజనానికి వాడుకోకుండా, నిరాడంబరంగా సమాధిచెందటం, ఇతరులతో అరుదుగా కనిపించే విశేషం. అనేకానేక సాయిగాధలను వివిధ భాషల నుండి మిక్కిలి మరాఠీ భాష నుండి ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారికి తెల్పటం జరిగింది.

నాల్గు ఆరతులలోని, ఒక్కొక్క ఆరతి ప్రాశస్త్యాన్ని ఆయన తెలిపారు. సాయి సచ్ఛరితలో ఎవరికి తెలియని అనేక సంఘ టనల విశేషాలను ఆయన వివరించారు. ఉదాహరణ 19వ అధ్యాయం (సాయి సచ్ఛరిత)లో సాయికి నిచ్చెన తెచ్చి ఇచ్చినవాడెవరు, కారణం మొదలైనవి ఆయన రుజువ్ఞతో తెలిపారు. ధుని వాతావరణ కాలుష్యం చేయదు అని ప్రయోగాత్మకంగా చూచుకొమ్మని రష్యన్‌శాస్త్రజ్ఞులకు ‘సవాల్‌విసిరారు. శివనేశన్‌ స్వామీజీ తెల్పింది సత్యమేనని వారు ప్రయోగాత్మకంగా పరిశీలించి గ్రహించారు. ధునిమాతకు, ధునికి అత్యంత ప్రాధా న్యతను సాయిభక్తులు గ్రహించేలా చేశారు.

తనపై ఉన్న విష ప్రయోగం జరిగినా, ధునినే శరణనని, ఊదినే సేవించి స్వామీజీ స్వస్థులయ్యారు. సాయి సబ్‌ కా మాలిక్‌ ఏక్‌ హై అంటే స్వామీజీ ‘సబ్‌ కా మాలిక్‌ సాయి అనేవారు. స్వామీజీ సమాధి పింపల్‌వాడి రోడ్డు (షిరిడీ)లో ఉన్నది. స్వామీజీ సమాధి దినం ఫిబ్రవరి 12 (మాఘ బహుళ సప్తమి). స్వామీజీ భక్తి, సేవాగుణాలు అందరకూ అలవడు గాక!

– యం.పి.సాయినాథ్‌