భౌతికకాయం అప్పగింతపై సస్పెన్స్

SRIDEVI-22
SRIDEVI

శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. శ్రీదేవి పార్థీవదేహం అప్పగించేందుకు ఎంత టైమ్ పడుతుందో చెప్పలేమని దుబాయ్ లోని భారత రాయబారి పేర్కొంటున్నారు. పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు. భౌతికకాయం అప్పగింతకు మరి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని భారత రాయబారి తెలుపుతున్నారు. శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగించడంతో మరింత ఆలస్యమవుతోంది. ఇప్పటి వరకు ఫోరెన్సిక్ నివేదికలు, శవ పరీక్షలు పూర్తయ్యాయి. మరో వైపు కేసు పూర్తయ్యే వరకు దుబాయ్ విడిచి వెళ్లొద్దని శ్రీదేవి భర్త బోనీ కపూర్ కు దుబాయ్ పోలీసులు ఆదేశించారు.