భోపాల్‌ నుంచి ఎన్నికల బరిలో కరీనా?

kareena kapoor
kareena kapoor

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అత్యంత కీలక స్థానమైన భోపాల్‌ నగర లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్‌ నటి, పటౌడి ఇంటి కోడలు కరీనా కపూర్‌ బరిలోకి దించేందుకు కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల గెలుపులో కీలక పాత్ర పోషించిన గుడ్డు చౌహాన్‌, అనీస్‌ ఖాన్‌ వంటి స్థానిక నాయకులు కరీనాను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర సియం కమల్‌నాథ్‌తో చర్చించాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.