భోజన నియమాలు

                                    భోజన నియమాలు

FOOD
FOOD

సాత్వికాహారం, మితాహారం చాలా మంచిది. వయస్సును బట్టి భోజనం కూరతోను, చారుతోను చివరగా మజ్జిగ శ్రేష్టం. రుచిగా ఉన్నదని అతిగా భోజనం చేయవద్దు. ఘనపదార్థం, వాటర్‌తో భోజనం ముగించాలి. బాగా నమిలి భోజనం చేయాలి. వేపుళ్ళు, పచ్చళ్లు, ఎక్కువగా వద్దు. ఫ్రిజ్‌వాటర్‌ బంద్‌ చేయాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ మధ్యాహ్నం భోజనం రాజులా, రాత్రి భోజనం పిసినారిలాగ ప్రవర్తించాలి. టిఫిన్‌ చేసిన తరువాత నడవాలి. మధ్యాహ్నం భోజనం తరువాత కొద్దిగా విశ్రమించాలి. రాత్రులు భోజనం తరువాత 100 అడుగులు నడవాలి. రోజూ విందు భోజనం కడుపునకు చేటు. టివిలు చూస్తూ, సెల్‌ఫోనులు మాట్లాడుతూ భోజనం చేయవద్దు. ఆకుకూరలు, కాయగూరలు చాలా మంచిది. తరువాత తాజాపండ్లు కాలానుగుణంగా భోజనం. వేసవిలో తక్కువ భోజనం, చలికాలం ఎక్కువ భోజనం వర్షాకాలం మధ్యస్థాయిలో ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి ఆహారంతో పాటు తీసుకోవచ్చును. రాత్రులు భోజనం 9గంటలలోపు ముగించాలి. పదేపదే టీలు, కాఫీలు, గుట్కాలు మానివేయండి. సాత్వికాహారంతో నూరేళ్లు జీవించండి. పాలు, నెయ్యి, తేనె, మజ్జిగ, పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. బలవర్థకమైనవి.రుచికరమైనవి.