భూ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్

TS Minister Eetela Rajendar
TS Minister Eetela Rajendar

సెప్టెంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు 90 రోజల పాటు భూ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో రైతు సమన్వయ సమితుల ఏర్పాటుచేశారన్నారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుతో అందరి కష్టాలు తీరుతాయన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లు మాత్రమే ఉన్నాయని, ఈ కారణంగానే తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్లు చేసే అధికారమిస్తున్నామని చెప్పారు.