భూ సమగ్ర సర్వేపై విమర్శలు చేయడం తగదు: కేసీఆర్‌

kcr
ts cm kcr

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ భూరికార్డులను ఎందుకు ప్రక్షాళన చేయలేకపోయిందో చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌
డిమాండ్‌ చేశారు. భూరికార్డులపై శాసనసభలో చేపట్టిన చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూసమగ్ర సర్వేకు
సంబంధించి ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు. దీనికి స్పందించిన కేసీఆర్‌, భట్టి వ్యాఖ్యలను ఖండించారు. భూరికార్డుల ప్రక్షాళనపై ప్రతిపక్షాలు
అనవసర విమర్శలు చేయడం సరికాదని, సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి 15ఏళ్ల క్రితం అమ్మిన భూమికి కూడా గత ప్రభుత్వం పట్టా
ఇవ్వలేకపోయిందని, భూసమగ్ర సర్వేలో భాగంగా ఆ భూమికి తమ ప్రభుత్వం పట్టా ఇచ్చిందని ఆయన అన్నారు.