భూవివాదంలో మ‌హిళ‌ను త‌న్నిన ఎంపిపి

BREAKING NEWS
BREAKING NEWS

నిజామాబాద్: జిల్లాలోని ఇందల్‌వాయ్‌లో దారుణం జరిగింది. స్థలం విక్రయం విషయంలో ఓ కుటుంబానికి, ఎంపిపికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థలం విక్రయంపై ప్రశ్నించినందుకు ఆ కుటుంబానికి చెందిన మహిళను ఎంపిపి గుండెల మీద తన్నాడు. ఇప్పడు ఈ గొడవ జిల్లాలో కలకలం రేపుంతోంది. స్థలం రిజిస్ట్రేషన్ తర్వాత ఎంపీపీ గోపీ అదనంగా డబ్బులు అడిగారని ఆమె చెప్పింది. ఇదే విషయమై ఎంపీపీ ఇంటిముందు బంధువులతో ఆమె నిరసనకు దిగింది. దీంతో వాగ్వాదం మొదలైంది. ఈ గొడవలో మహిళ ఎంపీపీని చెప్పుతో కొట్టింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గోపి మహిళ గుండెలపై తన్నాడు. అప్రమత్తమైన ఆమె బంధువులు ఎంపీపీని తోసేశారు. ఇప్పుడు ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.