భూటాన్‌తో దౌత్యబంధం మరింత పటిష్టం

INDO BHUTAN
INDO BHUTAN

భూటాన్‌తో దౌత్యబంధం మరింత పటిష్టం

హిమాలయన్‌దేశంలో మోడీ పర్యటనకు ఏర్పాటు

న్యూఢిల్లీ, మార్చి 11 : డోక్లామ్‌ ట్రైజంక్షన్‌వద్ద చైనాతో నెలకొన్న 73రోజుల ప్రతిష్టంభన తర్వాత భారత్‌ దౌత్యపరంగా భూటాన్‌తో సంబంధాలుమరింత మెరుగుపరుచుకునేందుకు దృష్టిసారించింది. ప్రధా ని నరేంద్రమోడీ ఈ చిన్నపాటి హిమాలయ దేశం లో పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌ చైనాలమధ్య ఉన్న ఈ చిన్నదేశంపై చైనా ఆధి పత్యం కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండుదేశాలమధ్య దౌత్యసంబంధాలు చిగు రించి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సంద ర్భంగా మరింతగా సంబంధాలు పెంచాలని నిర్ణ యించారు.భారత్‌ చైనాలమధ్య డోక్లామ్‌ ప్రాం తంలో 73 రోజులపాటు ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే.

50ఏళ్ల దౌత్యసంబం ధాలు కొనసాగేవిధంగా రెండుదేశాలమధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ప్రధాని మోడీ ఈ ఏడాదే ఆదేశంలో పర్యటిస్తున్నారు. ప్రధాని పర్యటనకు సముఖత వ్యక్తంచేసారని, తేదీలు కూడా త్వరలోనే నిర్ణయిస్తామని దౌత్యపరమైన విధానంలోనే జరుగుతాయని అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. 1968 జనవరి 8వ తేదీనుంచి భారత్‌ భూటాన్‌తో దౌత్యసంబంధాలు కొనసా గిస్తోంది.

అప్పటికి ఆదేశం చైనాతో ఎలాంటి దౌత్యసంబంధాలు లేవు. గత ఏడాది చైనా గ్రూప్‌లను డోక్లామ్‌లో రోడ్డు నిర్మాణం చేయడాన్ని అడ్డుకున్నది. ఇండియా భూటాన్‌ టిబెట్‌ట్రైజంక్షన్‌ వద్ద చైనా కార్యకలాపాలపై భారత్‌ జోక్యంతో గట్టి ప్రతిఘటన ఇచ్చింది. ఆగస్టులో ఈ మిలిటరీ కవాతులన్నీ ముగిసాయి.

కొత్తఢిల్లీ, బీజింగ్‌ రెం డూ కూడా ఈ ఉద్రిక్తతలను సడలించేందుకు తమ తమ మిలిటరీని వెనక్కు పిలిపించాయి. ప్రధానిగా 2014లో బాధ్యతలు స్వీకరించిన వెనువెంటనే తమదేశం రావాలని ఆహ్వానించిన మొదటి దేశం భూటాన్‌. వెనువెంటనే మోడీ తన మొదటి పర్య టనలోనే హిమాలయన్‌ దేశం భారత్‌కు అత్యంత గౌరవప్రదమైన భాగస్వామి అని అన్నారు. భారత్‌ భూటాన్‌ ఆధ్యాత్మిక నేత జీఖెన్‌ పోకు ఆతిధ్యం ఇస్తోంది. భూటాన్‌రాజు నియమించిన ఈ ఆధ్యా త్మిక అధిపతి ప్రపంచశాంతికి ప్రార్ధనలు చేస్తు న్నారు.

ప్రస్తుత జెఖెన్‌పో 70వ ఆధ్యాత్మికగురుగా పదవిని అధిష్టించారు. అంతే కాకుండా భూటాన్‌ భారత్‌ స్నేహస్థూపాన్ని సైతం మరో కార్యక్ర మంలో భారత్‌ నిర్మిస్తోంది. అయితే ఎక్కడ నిర్మిం చాలన్న వివరాలను వెల్లడించలేదు. అంతేకాకుండా భూటాన్‌కు అభివృద్ధి పరంగా మరింతముందుకు తీసుకెళ్లేందుకు నిధులు కేటాయిస్తోంది. హైడ్రో పవర్‌, మౌలికవనరులు, వంటిప్రాజెక్టులు నిర్మా ణం అవుతున్నాయి. మోడీ పర్యటనలో మంగ్‌డెచ్చు హైడ్రోపవర్‌ప్రాజెక్టును ప్రారంభిస్తారని సమాచారం.

720 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్ప త్తికేంద్రం హంగ్‌డెచ్చు నదిపై నిర్మించారు. మధ్య భూటాన్‌లోని ట్రోంగ్సా డిజెంగ్‌ఖగ్‌ జిల్లాలో ఈప్రాజెక్టు ఏర్పాటయింది. ఇప్పటివరకూ భారత ప్రభుత్వం మూడు జల విద్యుత్‌ ఉత్పత్తిప్రా జెక్టులను భూటాన్‌లో నిర్మించింది.

మొత్తం 1416 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. ఈప్రాజెక్టులనుంచి వచ్చినమిగులు విద్యుత్‌ను భారత్‌కు సరఫరా అవుతుంది. హైడ్రోపవర్‌ ఎగు మతులు భూటాన్‌ దేశ రాబడుల్లో 40శాతానికి పైగా ఆదాయం సమ కూరుస్తాయి. ఆదేశ జిడిపి లో 25శాతం వాటాతో ఉంటుందని అంచనా.