భువనేశ్వర్‌ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

gold
Gold

ఒడిశా: భువనేశ్వర్‌ విమానాశ్రయంలో చేపట్టిన తనిఖీల్లోభాగంగా 5.88కిలోలల అక్రమ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్‌ నుంచి ముగ్గురు వ్యక్తులు అక్రమ బంగారాన్ని తరలిస్తున్నారని సమాచారం అందడంతో డిఆర్‌ఐ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తుల నుంచి బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.1.88కోటుల ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.