భావితరాలకు గుర్తుండేలా సంక్రాంతి సంబరాలు

 

MRUNALINI
విజయనగరం: భావితరాలకు గుర్తిండిపోయేలా సిఎం చంద్రబాబు ఆదేశానుసారం సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్టు ఎపి గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. బుధవారం ఇక్కడి అయోధ్య నగర్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేందుకు అందరూ కలిసి ఒకచోట పండుగ చేసుకునేందుకు వీలుగా భవిష్యత్‌ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.