భార‌త సైనికుల చొర‌బాటు వ‌ల్లే డోక్లాం వివాదంః చైనా

india china
india, china

బీజింగ్‌: భారత సైనికుల చొరబాటు వల్లే డోక్లాం వివాదం చేల‌రేగింద‌ని చైనా ఆరోపించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భారత భద్రతా బలగాలు తమ సరిహద్దు దాటి చొరబడటం వల్లే వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇది భారత్‌-చైనా ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే చివరకు దౌత్యపరమైన చర్చలతో సమస్య శాంతియుతంగా పరిష్కారమైంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘అయితే ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలి’ అని చైనా భారత్‌ను హెచ్చరించే ప్రయత్నం చేసింది. రష్యా, భారత్‌, చైనా విదేశాంగ మంత్రుల భేటీలో పాల్గొనేందుకు వాంగ్‌ సోమవారం భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. డోక్లాం వివాదం తర్వాత చైనా మంత్రి ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.