భార‌త్ మీడియా అంటే చాలా ఇష్టంః జూనియ‌ర్ ట్రంప్‌

Jr trump
Jr trump

న్యూఢిల్లీః అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు ట్రంప్ జూనియర్‌ భారత మీడియాపై ప్రశంసలు కురిపించారు. గ్లోబల్‌ బిజినెస్‌ సదస్సులో మాట్లాడిన ఆయన తనకు భారత మీడియా అంటే చాలా ఇష్టమని చెప్పారు. అమెరికా మీడియాతో పోలిస్తే ఇక్కడి మీడియా చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ అక్కడి మీడియాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత చరిత్రలో.. ఐ లవ్‌ ఇండియన్‌ మీడియా అని చెప్పిన తొలి వ్యక్తి తానేనని చెప్పుకొచ్చారు. అమెరికా మీడియాను దూకుడు కలిగిన, భయంకరమైన మీడియాగా.. భారత మీడియాను సున్నితమైన, చక్కని మీడియాగా అభివర్ణించారు