భార్య‌తో ఛాటింగ్ చేస్తున్నాడ‌ని హ‌త్య‌

Murder
Murder

విజయవాడ: సోషల్ మీడియా మనుషుల ఆరోగ్యాలను దెబ్బతీయడమే కాదు.. ఏకంగా ప్రాణాలు హరిస్తున్నది. విజయవాడలో జరిగిన ఘటనే ఇందుకు తాజా నిదర్శనం. తన భార్యతో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడని ఓ వ్యక్తిని ఆమె భర్త హత్య చేసిన ఘటన విజయవాడ జరిగింది. వివరాల్లోకెళితే.. గన్నవరంకు చెందిన రామాంజనేయ శర్మ స్థానికంగా ఉన్న ఓ వివాహితతో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడు. ఇది గమనించిన ఆమె భర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో శర్మ సంగతేంటో చూడాలని చెప్పి తన ముగ్గురి స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్‌తో గన్నవరం విమానశ్రయానికి చేరుకున్నాడు వివాహిత భర్త.   ఇంతలో రామాంజనేయ శర్మ అక్కడికి రావడంతో ముగ్గురు మిత్రులతో అతనిపై దాడి చేసి అతికిరాతకంగా చంపేశారు. ఉన్నట్టుండి భర్త కనపడకపోవడంతో శర్మ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే చేధించి.. హంతకులను అరెస్ట్ చేశారు. అయితే వివాహితతో శర్మకు ఎలాంటి వివాహేతరం సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలింది. అనుమానంతోనే రామాంజనేయ శర్మను వివాహిత భర్త చంపాడని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.