భారీ షెడ్యూల్‌ పూర్తి

BALA KRISHNA

BALA KRISHNA

భారీ షెడ్యూల్‌ పూర్తి 

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ సి.కె.ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కుంభకోణంలో ఓ భారీ షెడ్యూల్‌ జరుపుకుంటోంది. సోమవారం నేటితో కుంభకోణం షెడ్యూల్‌ పూర్తవ్ఞతుంది. ఈ రోజు కుంభకోణంలో ఓ భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఓ ఆలయం నేపథ్యంలో సాగు ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మనందం, మురళీమోహన్‌, జెపీ, ఎల్బీ శ్రీరామ్‌లతో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా షాలు పంచుకొంది. దాదాపు 2వేల మంది పురోహితులు, పైటర్లు, జూనియర్‌ ఆర్టిస్టుల నేపథ్యంలో పైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌, అరివి మణి ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ గారు హీరోగా ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఎం.రత్నం, అద్భుతమైన కథను అందించారు. శ్రీరామరాజ్యం, సింహా వంటి బ్లాక్‌ బస్టర్ల అనంతరం బాలకృష్ణ సరసన నయనతార నటించనుండడం విశేషం. రాంప్రసాద్‌ గారు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా బాలయ్య 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికిసంగీత సారధ్యం వహించి చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన చిరంతన్‌ భట్‌ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చనుండడం విశేషం. 30 రోజుల పాటు సాగిన కుంభకోణం షెడ్యూల్‌లో కీలకసన్నివేశాలతో పాటు ఓ భారీ పోరాట ఘట్టం రూపొందించాం. బాలయ్యపై ఓ గీతాన్ని తెరకెక్కించాం. ఖర్చుకి ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు. బాలకృష్ణ, నయనతార, నటాసా దోషీ, ప్రకాష్‌రాజ్‌, మురళీమోహన్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, ప్రభాకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణరెడ్డి, పోరాటాలు: అరివ్ఞమణి- అంబుమణి, సినిమాటోగ్రపీ: రాంప్రసాద్‌, సంగీతం: చిరంతన్‌ భట్‌, సహ-నిర్మాత: సి.వి.రావ్ఞ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: వరుణ్‌ తేజ్‌, నిర్మాణం: సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రై.లి., దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌.