భారీ వేడుకతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ

MAHESH BABU-1
MAHESH BABU

భారీ వేడుకతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం చేస్తున్న ‘స్పైడర్‌ చిత్రం తెలుగతోపాటు తమిళంలో కూడ ఒకేసారి రిలీజ్‌కానున్న సంగతి తెలిసిందే.. ఈసినిమాతో తమిళ మార్కెట్‌లోకి తన పరిధిని విస్తరించాలని భావిస్తున్నారు.. అందుకే అక్కడ కూడ భారీ ఎత్తున విడుదల ప్లాన్‌ చేశారు.. అంతేకాక తమిళంలో నేరుగా విడుదలకానున్న మహేష్‌ మొదటి చిత్రం కావటంతో ఇదే ఆయనకు కోలీవుడ్‌లోకి అధికారికప్రవేశం కానుంది. దీంతో అక్కడ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న నిర్మాతలు మహేష్‌ ఎంట్రీ కోసం గ్రాండ్‌గా లాంచింగ్‌ వేడుకను సిద్ధం చేశారు.. ఈవేడుక సెప్టెంబర్‌ 9న చెన్నైలో జరగనుంది.. ఈ కార్యక్రమంతో తమిళపరిశ్రమలోకి మహేష్‌ ఎంట్రీ జరగనుంది..స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ ఈచిత్రాన్ని డైరెక్టు చేస్తుండటం, హరీశ్‌ జైరాజ్‌మ్యూజిక్‌ ఇవ్వటం, ఎస్‌జె.సూర్య , భరత్‌వంటి తమిళనటులు నటించటంతో ఈసినిమాపట్ల అక్కడి ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈచిత్రాన్ని సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయనున్నారు.