భారీ వర్షాలు..పట్టాలు తప్పిన గూడ్స్‌ రైళ్ల

Goods train
Goods train

భువనేశ్వర్‌: ఎగువ ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆంధ్రా సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని అంబోదలదోయికళ్లు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్‌ రైలు ఒకటి పట్టాలు తప్పింది. అయితే భారీ వర్షాల వల్ల వరద నీటికి పట్టాలు దెబ్బతినడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రాక్ పునరుద్ధరించేంత వరకు ఆ మార్గంలో వెళ్లే ఎనిమిది రైళ్లను రద్దు చేస్తున్నామని, మరో ఐదు రైళ్లను దారి మళ్లిస్తున్నామని తెలిపారు.

రద్దైన రైళ్లు వివరాలు


1. సంబల్పూర్- కొరాపుట్‌ ప్యాసింజర్‌
2. కొరాపుట్- సంబల్పూర్ ప్యాసింజర్

3. సంబల్పూర్‌ – జనఘర్‌ రోడ్ ప్యాసింజర్

4. జనఘర్‌ ‌- సంబల్పూర్ ప్యాసింజర్

5. రాయపూర్-విశాఖ ప్యాసింజర్
6. విశాఖ – రాయపూర్‌ ప్యాసింజర్ 
7. సంబల్పూర్‌- రాయగడ ఎక్స్‌ప్రెస్‌
8. రాయగడ- సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌

దారి మళ్లించిన రైళ్ల వివరాలు


1.పూరి- ఆహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌
2.అహ్మదాబాద్- పూరి ఎక్స్‌ప్రెస్‌
3.బెంగళూరు- హతియా ఎక్స్‌ప్రెస్‌
4. ధన్‌బాద్‌- అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌
5. విశాఖ – నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్‌.. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/