భారీ వర్షాలు కురిసే అవకాశం

Moonsoon
Moonsoon

బంగాళాఖాతంలో ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, మరో 48 గంటల్లో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.