భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

stock market
stock market

ముంబైః బ్యాంకింగ్‌, రిలయన్స్‌ షేర్ల దన్నుతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌ ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 282 పాయింట్లు ఎగబాకి 36,548 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకింది. అటు నిఫ్టీ కూడా 75 పాయింట్ల లాభంతో 11,023 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.59గా కొనసాగుతోంది.