భారీ భద్రత నడుమ అయోధ్య

hi alert at ayodhya
hi alert at ayodhya

అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు 26 ఏళ్లు పూర్తయినాయి. ఈ నేపథ్యంలో యుపిలో అయోధ్య నగరంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. 1992 డిసెంబరు 6న హిందూత్వ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌ ఇవాళ శౌర్య దివస్‌, విజ§్‌ు దివస్‌ గా జరుపుకుంటున్నాయి. మరో వైపు ముస్లిం వర్గాలు యావుమ్‌ ఈ ఘమ్‌(సంతాప దినం), యావుమ్‌ ఈ స్యాహ్‌ (చీకటి రోజు)గా పాటిస్తునాయి. దీంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.