భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. వారాంతంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 505 పాయింట్లు నష్టపోయి 65,280కి పడిపోయింది. నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 19,331కి దిగజారింది.