భారీపోరాటాల మధ్య

MAHESH BABU
MAHESH BABU

భారీ పోరాటాల మధ్య

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ‘స్పైడర్‌ టాకీపార్ట్‌ను పూర్తిచేశారు.. ఇటీవలే చెన్నైలో జరిగిన చివరి షెడ్యూల్‌లోసినిమా క్లైమాక్స్‌ ఎపిపోడ్‌ను షూట్‌ చేశారని తెలిసింది.. ముందునుండి చెబుతున్నట్టుగా హెవీ యాక్షన్‌ సబ్జెక్టు కలిగిన ఈచిత్రంలో భారీ తరహా పోరాట సన్నివేశాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ ఎపిసోడ్‌లో వచ్చే ఫైట్నఉ భారీస్థాయిలో తీవ్రమైన రీతిలో రూపొందించారట..
ప్రముఖ ఫైటింగ్‌ కొరియోగ్రాఫర్‌, బాహుబలి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు పనిచేసిన పీటర్‌ హెయిన్స్‌ ఈ పోరాటాల్ని కంపోజ్‌ చేశారని, మహేష్‌, ఎస్‌.జె.సూర్యలకు మధ్యనడిచే ఈ ఎపిసోడ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు మంచి కిక్‌ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు.. మరి కిక్‌ ఎలా ఉంటుందనేది తెరపైచూడాల్సిందే.. కేవలం రెండు పాటలచిత్రీకరణమాత్రమే మిగిలి ఉన్న ఈచిత్రాన్ని దసరాగా కానుకగా రిలీజ్‌ చేయాలని దర్శక,నిర్మాతల ఆలోచనగా ఉంది.