భారీగా ప‌త‌న‌మైన మార్కెట్లు

Stock Market
Stock Market

ముంబైః చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య ఆంక్షల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ఇది దారి తీయవచ్చని భయపడుతున్నారు. దీని ప్రభావంతో అమెరికా, ఐరోపా మార్కెట్లు డీలాపడ్డాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 410 పాయింట్లు పతనమై 32,597కు పడిపోయింది. నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 9,998కి దిగజారింది.