భారీగా పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం!

vegetables
vegetables

ఢిల్లీ: ఆహారపదార్థాల ధరలు విపరీతంగా పెరగడం, అకాల వర్షాల కార‌ణంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబరు నెలలో 4.88శాతంగా నమోదైంది. నవంబరు నెలలో ద్రవ్యోల్బణం 4శాతంగా నమోదవుతుందన్న రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అంచనాలకు మించి నమోదు కావడం గమనార్హం. అంతకుముందు నెలలో(అక్టోబర్‌)లో ద్రవ్యోల్బణం 3.59శాతంగా నమోదై ఆర్నెల్ల గరిష్ఠానికి చేరింది. దీనికి సంబంధించిన నివేదికను గురువారం వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) విడుదల చేసింది. ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగానే నవంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.20శాతాన్ని దాటుకొని 15నెలల గరిష్ఠానికి చేరుకుంది. మరోవైపు అక్టోబరు నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 2.2శాతానికి పడిపోయింది. నవంబరు నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా కూరగాయలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఉల్లిపాయలు, టొమాటో ధరలు పెరిగినట్లు లార్సన్‌ అండ్‌ టర్బో గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ రూపా రేగే తెలిపారు.