భారీగా పెరిగిన ఏపీపీఎస్సీ చైర్మ‌న్, స‌భ్యుల జీతాలు!

APPSC
APPSC

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులకు వేతనాలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
జారీచేసింది. దీనికి సంబంధించి జీవో నెం.123ను విడుదల చేసింది. కేంద్ర ఏడో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ
నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ జీతం రూ.80 వేల నుంచి రూ.2.25లక్షలకు పెంచగా.. సభ్యుడి
జీతాన్ని రూ.79వేల నుంచి రూ.1.82లక్షలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం పెర్కొంది.