భారీగా న‌కిలీ నోట్ల ర‌వాణా

Fake Currency
Fake Currency

బెంగ‌ళూరుః కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెళగావిలో భారీగా నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 7 కోట్ల విలువ చేసే రూ. 2 వేల నోట్లు, రూ. 500ల నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ నోట్లు తరలిస్తున్న ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.