భారీగా న‌కిలీ గుట్కా ప్యాకెట్లు ప‌ట్టివేత‌

gutkha
Gutka

హైదరాబాద్: నగరంలోని లాలాగూడలో గల సరస్వతి కిరాణా దుకాణంపై ఎస్‌వోటీ పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో నిషేధిత నకిలీ గుట్కా ప్యాకెట్లను భారీగా పట్టుకున్నారు. వీటి విలువ రూ. 3 లక్షలుగా సమాచారం. అదేవిధంగా రెండు కార్లు, ఐదు సెల్‌ఫోన్లు, రూ. 87,300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.