భారత సినీ కలికితురాయి దాదాసాహెబ్‌ ఫాల్కే

దాదాసాహెబ్‌ ఫాల్కే వర్ధంతి

 

dadasaheb-phalke
dadasaheb-phalke

భారత సినీ కలికితురాయి దాదాసాహెబ్‌ ఫాల్కే

ఎందరో జన్మిస్తుంటారు. ప్రపంచం నుండి నిష్క్రమి స్తుంటారు. కానీ కొందరే చరిత్ర సృష్టిస్తారు. సమాజంలోని వ్యక్తులకు దిక్సూచిలవ్ఞతారు. అలాంటి వారిలో ఒకరు దాదాసాహెబ్‌ ఫాల్కే. వీరి పూర్తి పేరు దుండిరాజ్‌ గోవింద్‌ ఫాల్కే (దాదాసాహెబ్‌ ఫాల్కేగా ప్రసిద్ధుడు) భారతదేశ సినిమాకు కేంద్ర బిందువు.

‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా ఖ్యాతి గడించారు. ఫాల్కే ఏప్రిల్‌ 30వ తేదీ 1870లో మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వరంలో జన్మించారు. భారత మూకీి సినిమా ఆద్యుడు ఫాల్కే దాదాసాహెబ్‌ ఫాల్కే సినిమా ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌, స్క్రీన్‌రైటర్‌. వీరి సినీ ప్రస్థానం 1913లో విడుదలైన రాజా హరిశ్చంద్రతో ప్రారంభమైంది. భారతదేశ సినిమా చరిత్రలో మొట్టమొదటి పూర్తిస్థాయి లక్షణాలు కలిగిన ఫుల్‌లెంథ్‌ సినిమాను నిర్మించిన డైరెక్టర్‌ మన ఫాల్కే. తన జీవిత సినీ చరిత్ర పుటల్లో 95 పూర్తిస్థాయి సినిమాలు, 26 షార్ట్‌ఫిల్మ్‌లు, కేవలం 19 సంవత్సరాలలో నిర్మించిన ఘనచరితుడు. 1885 సంవత్సరంలో సర్‌. జే.జే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ (ముంబాయి)లో చేరారు. అక్కడి నుండి 1890 వడోదరలోని కళాభవన్‌, మహారాజా సయాజీరావ్ఞ యూనివర్శిటీ ఆఫ్‌ బరోడాలో ఇంజినీరింగ్‌, డ్రాయింగ్‌, పెయిం టింగ్‌, ఫొటోగ్రఫీలలో డిగ్రీలు సంపాదించారు. ఫాల్కే మొట్టమొ దటిసారి వారి జీవిత ప్రయాణాన్ని తన స్వయంకృషిని నమ్మి తన ప్రవృత్తినే వృత్తిగా మలచుకొని గోధ్రాలో ఒక చిన్న ఫొటోగ్రాఫర్‌గా జీవితం ప్రారంభించారు. కొద్ది సంఘటనల తదుపరి ఫాల్కే ఇండియన్‌ ఆర్కియాలజీ సర్వేలో డ్రాఫ్ట్‌మ్యాన్‌గా సేవలందించారు. అదేవిధంగా ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్త సుప్రసిద్ధ చిత్రకా రుడు రాజా రవివర్మకు కూడా వీరు చిత్రలేఖనంలో సేవలం దించారు. దాదా సాహెబ్‌ఫాల్కే జీవితంలో ఒక్కొ క్కమెట్టు పదిలం గా ఎక్కుతూ తన స్వీయ ముద్రణా లయం ప్రారంభిం చారు. ఇందులో భాగంగా జర్మనీ దేశం వెళ్లి అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త యారు చేసిన పరి క రాలను చిత్రలే ఖనం, ఫొటోగ్రఫీ కి సంబంధించినవి కొనుగోలు చేసి వాటిలో నిష్ణాతులయ్యారు.ఫొటోగ్రఫీనుండి సినిమాటోగ్రఫీ¶ికి 1912లో రాజా హరిశ్చంద్రలో ప్రవేశించి, ముంబాయికి చెందిన ఐదుగురు భాగస్వాములతో కలిసి హిందుస్థాన్‌ ఫిల్మ్స్‌ కంపెనీని స్థాపించారు.

ఆర్థిక అంశాల వల్ల 1920లో హిందుస్థాన్‌ ఫిలిమ్స్‌ కంపెనీకి రిజైన్‌ చేశారు. తదుపరి రచయితగా కలాన్ని ఎక్కుపెట్టి రంగ్‌భూమి అనే అద్భుతమైన సినిమాకథను రచించారు. ఫాల్కే తన ప్రవృత్తిలో వృత్తిని దేవ్ఞనితో సమానంగా భావించి తీసిన సామాజిక స్పృహకలిగిన సినిమాలలోకొన్ని రాజాహరిశ్చంద్ర (1913), మొహి నీ భస్మాసుర (1913), సత్యావన్‌సావిత్రి (1914), లంకా దహన్‌ (1917), శ్రీకృష్ణ జన్మం(1918), కాళీయమర్థన్‌ (1919) బుద్ధ్ధదేవ్‌ (1923), సేతుబంధన్‌ (1932), గంగావతరణ్‌ (1937) లాంటివి ఉన్నాయి. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు భారతీయ సినీ చరిత్రకే తొలిమెట్టు అయిన దాదా సాహెబ్‌ ఫాల్కే గౌరవార్ధం 1969వ సంవత్సరంలో మన భారత ప్రభుత్వం సమాచార మంత్రిత్వ శాఖ వారు సినిమా రంగంలో ప్రతిభాపాటవా లను చూపుతూ మనదేశ సామాజిక, వారసత్వ, సాంస్కృతి అభి వృద్ధికి తోడ్పడుతున్న వ్యక్తులను ప్రోత్సహించడానికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రూపొందించారు. ఇది మన భారతదేశంలోని సినీ అవార్డులకు చెందిన అత్యున్నత పురస్కారం (ప్రపంచంలోని మూవీ అవార్డులలో ముఖ్యమైన అత్యున్నత పురస్కారం ఆస్కార్‌ అవార్డ్‌) దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ను 10 లక్షల నగదు, స్వర్ణక మలంగా బహూకరిస్తారు.

భారత ప్రభుత్వం తరపు నుండి 1969 లో మొట్టమొదటిసారి ఈ అవార్డును అందుకున్న వ్యక్తి దేవికారాణి. అదే విధంగా తెలుగు సినీరంగం నుండి మొదటిసారి ఈ ఫాల్కే అవార్డు 1974 లో బిఎన్‌రెడ్డి పొందారు. అదేవిధంగా 1990లో అక్కినేని నాగేశ్వరరావ్ఞ 2009లో దగ్గుబాటి రామానాయుడు ఈ అత్యున్నత పురస్కారాన్ని పొందడం విశేషం. సరదాకీ మీరంతా మా సినిమాలు చూస్తారండి అయినా మే మంటే ఓ చిన్నచూపు లెండి.. అనే మాటలు కేవలం వాక్యాలే కావ్ఞ సినిమా ప్రపంచం అని హృదయాలను సంపూర్ణంగా అంకితం చేసు కున్న నటుల విలువైన భావనఅది. సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయగల అత్యంత శక్తివంతమైన సాధనం సినిమా. చిన్న పిల్లల దగ్గరి నుండి ముసలివారి వరకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందిం చగలదిసినిమా.అలాంటి సినిమాకు ఆద్యుడైన దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిబ్రవరి 16వ తేదీ 1944 సంIIలో నాసిక్‌లో మరణించారు. వారు నేడు మనమధ్యలేకపోయినా ప్రతిభావంతుల శ్రమను గుర్తించే అవార్డు రూపంలో చిరకాలం మనమధ్య నిలిచే ఉంటారు.

-సూరం అనిల్‌