భారత పౌరుడు

బాలగేయం
                                  భారత పౌరుడు

INDEPENDENCE DAY
INDEPENDENCE DAY

మన భూమి భారత భూమి
భిన్న సంస్కృతులు పొదిగిన భూమి
విశ్వవిజేతగ ఎదిగిన భూమి
అమరవీరులను అందించిన భూమి
అహింసవాదం బోధించిన భూమి
స్వేచ్ఛారక్షణ ఇచ్చిన భూమి
అన్ని దేశములు మెచ్చిన భూమి
వేదాలను వల్లించిన భూమి
త్యాగాలను చిందించిన భూమి
ఇతిహాసాలకు నిలయం భూమి
ఏకత్వానికి వలయం భూమి
దేశ సంపదే జాతి సంపదగ భావించు
దేశపౌరుడై ప్రగతిదారుల పయనించు
భావి భారత భాగ్యవిధాతవై గర్వించూ
భరతమాతయే మాతృదేవతని నినదించు
– ధరణికోట శివరాంప్రసాద్‌