భారత క్రీడాకారిణి స్కృతి మందనకు స్థానం

S6
Smruthi Mandana

భారత క్రీడాకారిణి స్కృతి మందనకు స్థానం

 

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసిసి) మొట్టమొదటిసారి మహిళల విభాగంలో అవా ర్డులు ప్రకటించింది.కాగా ఈ సందర్భంగా ఐసిసి-2016 ఉమెన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌, వన్డే,టి20 విభాగాల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు విజేతల వివరాలు వెల్లడించింది. కాగా 12 మంది సభ్యులు గల ఐసిసి-2016 జట్టులో భారత క్రీడాకారిణి మందనకి స్థానం లభించింది. ఈ జట్టుకు వెస్టిండీస్‌ క్రీడాకారిణ స్టెఫానీ టేలర్‌ కెప్టెన్‌గా ఎంపికవగా న్యూజి లాండ్‌ క్రీడాకారిణి రచెల్‌ ప్రీస్ట్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపి కయ్యారు.అలాగే న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్‌ 2016 సంవత్సరానికి గాను వన్డే,టి20లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను గెలుచుకున్నారు.కాగా వన్డేల్లో ఈ అవార్డును అందుకోవడం బేట్స్‌ కెరీర్‌లో ఇది రెండవ సారి.ఎనిమిది వన్డేల్లో బేట్స్‌ 472 పరుగులు చేసింది.కాగా 2015 సెప్టెంబర్‌ 14-2016 సెప్టెంబరు 20 మధ్య కాలంలో క్రీడాకారిణుల ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించినట్లు ఐసిసి నిర్వాహకులు వెల్లడిం చారు. వన్డే,టి20 విభాగాల్లో ఒకే సంవత్సరా నికి ఒక క్రీడాకారిణి రెండు అవార్డులను సుజీ బేట్స్‌ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.