భారత ఆటగాళ్లు స్వార్థపరులు కాదు

Team
మెల్బోర్న్‌: భారత ఆటగాళ్లు స్వార్థపరులు అనే ప్రశ్నకు భారత వన్డే, టి20 కెప్టెన్‌ ధోనీ కాదని సమాధానం ఇచ్చాడు. కాగా మెల్బోర్న్‌లో జరిగిన మూడవ వన్డేలో భారత్‌, ఆసీస్‌ చేతిలో ఓడింది.తద్వారా సిరీస్‌ కూడా కోల్పోయింది. అనంతరం ధోనీ విలేఖరులతో మాట్లాడారు. కాగా ఈ సందర్భంగా విలేఖరుల నుంచి ధోనీకి ఊహించని ప్రశ్న ఎదురైంది.భారత బ్యాట్స్‌మెన్‌ సెంచరీల కోసం సెల్ఫిష్‌గా వ్యవహరిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించారు.దానికి ధోనీ క్లుప్తంగా లేదు ఖచ్చితంతా అలా కాదు, నేను అయితే అలా అనుకోవడం లేదు.మళ్లీ మళ్లీ అడగకండి,స్టాటిస్టిక్స్‌ మీ వద్దే ఉన్నాయి, కాబట్టి మళ్లీ మళ్లీ అడగొద్దు అని ధోనీ పేర్కొన్నాడు. అంతకు ముందు ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌మెల్‌ మాట్లాడుతూ భారత బ్యాట్స్‌మన్‌ మైలురాళ్ల కోసం ఆడుతున్నట్లున్నారని, సెంచరీలు చేసి అందరి దృష్టిలో పడవచ్చు.కానీ తనకు జట్టు గెలువడమే ముఖ్యమని గ్లెస్‌ మాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు.వన్డేల్లో సెంచరీల కోసం ఆటగాళ్లు చూసారని,అవి బ్యాట్స్‌మెన్‌ గణాంకాలను మాత్రమే మెరుగుపరుస్తాయన్నాడు.ఒక ఆటగాడు సెంచరీ సాధించాలని జాగ్రత్తగా ఆడుతూ పోతే జట్టుకు 40 నుంచి 50 పరుగులు నష్టం జరుగొచ్చునని,అది ఫలితం మీద ప్రభావం చూపిస్తుందని,భారత్‌కు అదే సమస్య అని మ్యాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు.