భారత్ 6 వికెట్ల తేడాతో విజయం

team india
team india

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 269 పరుగులు చేసింది. 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫోర్ తో మహేంద్ర సింగ్ ధోనీ విన్నింగ్ షాట్ కోట్టాడు.