భారత్‌ 22 ఇటిఎఫ్‌ నిధులు రూ.14,500 కోట్లు

STOCK
TOCK

భారత్‌ 22 ఇటిఎఫ్‌ నిధులు రూ.14,500 కోట్లు

న్యూఢిల్లీ, నవంబరు 21: కేంద్ర ప్రభుత్వం తన తొలి విడత భారత్‌ 22ఎక్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ ద్వారా మొత్తం రూ.14,500కోట్లను సమీకరించిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. భారత్‌ 22ను ఇటిఎఫ్‌కు వచ్చిన మొత్తం చందాల ద్వారా రూ.14,500కోట్లను సేకరించాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డిఐపిఎఎం)కార్యదర్శి నీరజ్‌ గుప్తా చెప్పారు.

భారత్‌22ఇటిఎఫ్‌లో పలు ప్రభు త్వ రంగ సంస్థలతోపాటు కొన్ని పేరుమోసిన వ్రైవేటు సంస్థలతో కలిపి మొత్తం 22 సంస్థలు న్నాయి. ఇటిఎఫ్‌కు మొత్తం రూ.32వేల కోట్ల బిడ్డింగ్‌లు వచ్చాయి. ఈ మొత్తంలో దాదాపు మూడింట ఒక వంతు విదేశీ సంస్థాగత ఇన్వెస్టరు ్ల(ఎఫ్‌ఐఐ)బిడ్డింగ్‌ జరిపారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన భాగానికి 1.45రెట్లు, రిటైర్‌మెంట్‌ ఫండ్స్‌కు 1.5రెట్లు, ఎన్‌ఐఐలు, క్యూఐబిలకు కేటాయించిన మొత్తాలకు 7శాతం ఎక్కువ బిడ్స్‌ వచ్చాయి.

ఈ మొత్తంతో కలుపుకొని ఇప్పటి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.52,500కోట్లను సమీకరించగలిగింది. ఇందులో కొన్ని ప్రభుత్వ రంగ బీమా సంస్థల ఐపిఒల లిస్టింగ్‌లు కూడా ఉన్నాయి. గత వారం ఇటిఎఫ్‌లో యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన భాగానికి 6రెట్లు ఎక్కువ బిడ్లు రావడం ద్వారా రూ.12వేల కోట్లు వచ్చాయి కూడా.