భారత్‌ భారీ ఆధిక్యం

Team india batting
Team india batting

భారత్‌ భారీ ఆధిక్యం

ఢిల్లీ: ఇక్కడి ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో భారత్‌ శ్రీలంక మూడో టెస్టు నాలుగో రోజు ఆటకు మంగళవారం పలు అవాంతరాలు ఏర్పడ్డాయి.. వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం తగ్గి వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోవటంతో ఆట సజావుగా సాగలేదు.. ఒకానొక దశలో ఇరుజట్ల సభ్యులు క్రీడామైదానంలోనే కాలుష్యం దెబ్బకి అస్వస్థలకు గురై నానా ఇబ్బందులు పడటమే కాకుండా కొందరుఫీల్డ్‌లోనే వాంతులు చేసుకోగా మరికొందరు డ్రెస్సింగ్‌లో వాంతులు చేసుకున్నారు.
భాతర్‌ తొలి ఇన్నింగ్స్‌ 536-7 వద్ద డిక్లేర్‌ చేయగా, శ్రీలంక ఓవర్‌నైట్‌ స్కోర్‌ 356-9 వద్ద ఆటను ప్రారంభించింది.. భారత్‌తో ఇన్నింగ్స్‌ 180 పరుగుల వెనుకంజలో ఉన్నశ్రీలంక జట్టులో అప్పటికే చండీమల్‌ (147), నందకన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు..
తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 373 ఆలౌట్‌
శ్రీలంక తొలి ఇన్నింగ్సలో 373 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 356 -9 తో ఆట ప్రారంభించిన శ్రీలంక మరో 17 పరుగలు మాత్రమే చేయగలిగింది.. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్సలో 163 పరుగలు ఆధిక్యం సాధించింది.

టెస్ట్‌ కెరీర్‌లో చండీమల్‌ అత్యధిక పరుగులు
శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ దినేష్‌ చండీమల్‌ టెస్టుల్లో అత్యధిక పరుగులు నమోదు చేసుకున్నాడు.. నాలుగోరోజు ఆటలో 150 పరుగులు పూర్తిచేసి చండిమల్‌ షమి బౌలింగ్‌లో టెస్టు కెరీర్‌లో తన అత్యధిక స్కోరు 164 ను నమోదుచేసుకున్నాడు.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం
లంకేయులతో భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.. తొలి ఇన్నింగ్స్‌ 536-7 డిక్లేర్‌ చేసిన సంగతి విదితమే. .కాగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 373 ఆలౌట్‌కావటంతో 163 పరుగుల ఆధిక్యాన్ని భారత్‌ సాధించినట్లైంది..
తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.. ఓపెనర్‌ విజ§్‌ు (9) చేసి లక్మల్‌ బౌలింగ్‌లో డిక్వెలాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం మ్యాచ్‌కు వాతావరణ కాలుష్యం అడ్డంకిగా మారింది.. శ్రీలంక బౌలర్‌ లక్మల్‌ అస్వస్థతకు లోనయ్యాడు.. బౌలింగ్‌ చేస్తున్న సమయంలో అతను మైదానంలో వాంతులు చేసుకున్నాడు.. దీంతో లక్మల్‌ విశ్రాంతి తీసుకోగా అతని స్థానంలో దాసున్‌ శనకను జట్టులోకి తీసుకున్నారు.. ఇదిలా ఉండగా దానున్‌శనక ముఖానికి మాస్క్‌ ధరించి మైదానంలోకి వచ్చాడు..
డ్రింక్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ 24-1
డ్రింక్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ ఒక వికెట్‌ నషా ్టనికి 24 పరుగులుచేసింది. ఈ దశలో క్రీజ్‌లో ధావన్‌ (6), రహానె (9) పరుగులతో ఉన్నారు. తదనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది.. రహానె 10 పరుగులుచేసి పెరెరా బౌలింగ్‌లో నందకన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారిపట్టాడు. కాగా మధ్యాహ్నం భోజనవిరామ సమయానికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 51 పరగులు మాత్రమే చేయగలిగింది.. ధావన్‌ (15), పుజారా (17) నిలకడగా క్రీజ్‌లో ఉన్నారు.. సాయంత్రం డ్రింగ్‌ సమయం వచ్చేసరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులుచేయగలిగింది.. ఇదిలా ఉంటే శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఉంచేలా భారత జట్టు తీరు కన్పించింది.. అప్పటికే ధావన్‌ (35), పుజార (45) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. స్కోరు 106 వద్ద ఉండగా భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.. పుజార (49) పరుగులు చేసి సిల్వ బౌలింగ్‌లో మాధ్యూస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తదనంతరం భారత్‌ బ్యాట్స్‌మెన్లు పరుగుల జోరును కొనసాగించారు.. భారీ ఆధిక్యం సాధించేలా మొదటి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు కలుపుకుని 300 పరుగులకు పైగా ఆధిక్యం సాధించింది.. ఈ దశలో క్రీజ్‌లో ధావన్‌ (66), కోహ్లీ (3) నిలకడగా ఆడుతున్నారు. స్కోరు 144 వద్ద ఉండగా భారత్‌ 4వ వికెట్‌ కోలోపయింది.. ధావన్‌ (67) పరుగులు చేసి సందకన్‌ బౌలింగ్‌లో స్టంప్‌ ఔట్‌ అయ్యాడు..కాగా టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్కోరు 4 వికెట్ల నష్టానికి 192 పరుగులుచేసింది.. దీంతో మొత్తంగా 355 పరుగుల ఆధిక్యంలోభారత్‌ నిలదొక్కుకుంది.. కోహ్లీ (25), రోహిత్‌ (28) మైదానంలో ఉన్నారు.
200మార్క్‌ దాటిన భారత్‌
ఒక దశలోభారత్‌ భారీ ఆధిక్యత వైపు దూసుకెళ్లింది.. రెండో ఇన్నింగ్స్‌లో 200 మార్క్‌ను దాటి సత్తాచాటుకుంది.. తొలి ఇన్నింగ్స అధిక్యం కలుపుకుని ప్రస్తుతం 367 పరుగుల ఆధిక్యంలో ఉంది.. అప్పటికే కోహ్లీ (34), రోహిత్‌ (31) క్రీజ్‌లో ఉన్నారు.. తదుపరి కోహ్లీ అర్ధశతకం పూర్తిచేసి గమెగా బౌలింగ్‌లో లక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.జట్టు మంచి స్కోరు తో శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.. ఇప్పటికే 400 పరుగుల ఆధిక్యతతో భారత్‌ జోరుగా ఆడుతోంది..
246-5 వద్ద భారత్‌ డిక్లేర్‌
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 246-5 పరుగులకు డిక్లేర్‌చేసింది.. శ్రీలంక విజయలక్ష్యం 410 పరుగులను నిర్దేశించింది.. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు శిఖర్‌ ధావన్‌ (67), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(50), రోహిత్‌శర్మ (50) నాటౌట్‌గా నిలవగా, చటేశ్వర్‌ పూజారా (49), పరుగులుచేసి ఔటయ్యాడు.. కాగా శ్రీలంక జట్టులో బౌలర్లు లక్మల్‌, గమగే పెరేరా, డిసిల్వా , సందకన్‌లు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీసుకున్నారు.. కాగా శ్రీలంక జట్టు విజయం సాధించాలంటే 410 పరుగులు చేయాల్సి వచ్చింది.
410 పరుగుల విజయలక్ష్యతో శ్రీలంక బ్యాటింగ్‌
మూడో టెస్టులో భారత్‌ 246 పరుగులకు డిక్లేర్‌ ఇవ్వటంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది.. ఓపెన్లు కరుణ తర్నే , సమర విక్రమలు బ్యాటింగ్‌ క్రీజులోకి దిగారు.. శ్రీలంక స్కోరు 14 పరుగుల వద్ద ఉండగా, ఆ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది.. సమర విక్రమ (5) పరుగులు చేసి మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో అజింక్య రహానేకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.కాగా స్కోరు 31 వద్ద ఉండగా జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది.. కరుణరత్నె 13 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లోసాహకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వెంటనే శ్రీలంక మూడో వికెట్‌ను కోల్పోయింది.. లక్మల్‌ ఖాతా తెరవకముందే జడేజా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.
శ్రీలంక 31-3 స్కోరు వద్ద చివరి టెస్టు నాలుగోరోజు ఆట ముగిసింది.. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఓవరాల్‌గా భారత్‌ 410 పరుగుల ఆధిక్యాన్నిసాధించినట్లైంది.. కాగా శ్రీలంక 379 పరుగులువెనుకంజలో ఉంది.