భారత్ ఐపిఒ చరిత్రలోనే ఐదో మెగా ఐపిఒ ఐసిఐసిఐ ప్రులైఫ్
భారత్ ఐపిఒ చరిత్రలోనే ఐదో మెగా ఐపిఒ ఐసిఐసిఐ ప్రులైఫ్
ముంబై, సెప్టెంబరు 11: ఐపిఒల చరిత్రలోనే ఐదో అతిపెద్ద ఐపిఒకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వస్తోంది. మొత్తం 6057 కోట్ల రూపాయల విలు వైన ఐపిఒకు రావాలని ఐసిఐసిఐ సెబీకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇష్యూధరను కూడా 300 నుంచి 334 రూపాయ లుగా నిర్ణయించింది. ఐసిఐసిఐబ్యాంకు ఈ సంస్థ లో 68శాతం వాటాలు కలిగి ఉంది. ఈ సంస్థ 12.,65శాతం వాటాలను అంటే 181 మిలియన్ల షేర్లను ఐపిఒలో విక్రయిస్తుంది. గరిష్టస్థాయి ధరవద్దనే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఐపిఒ ద్వారా 6057 కోట్ల రూపాయలు సమీ కరించగలమని ధీమా వ్యక్తంచేస్తోంది. దేశీయ మార్కెట్లలో ఈ ఐపిఒ ఐదో అతిపెద్ద ఐపిఒగా నిపు ణులు అంచనాలు వేస్తున్నారు. కోల్ ఇండియా 2010లో నిర్వహించిన ఐపిఒద్వారా అప్పట్లో 5440 కోట్లు సమీకరించింది. తాజాగా ఐసిఐసిఐ బీమా 43వేల కోట్ల రూపాయలు మార్కెట్ విలువ లతో ఉంది. అలాగే 47,890 కోట్ల రూపాయలుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు మదింపుచేశారు. ఐపిఐసిఐబ్యాంకు శుక్రవారం 0.8శాతం దిగువ స్థాయిలో 274 రూపాయలుగా ట్రేడింగ్ అయింది. ఐసిఐసిఐబ్యాంకు 1.59 లక్షలకోట్ల మార్కెట్ విలువ లున్న సంస్థగా మదింపుచేవారు. జీవితబీమా సంస్థ పరంగాచూస్తే మొత్తం 32,500 కోట్లుగా అంచనా వేసింది. ఆసక్తికరంగా ఐసిఐసిఐ ప్రూలైఫ్ విలువలు 45శాతం పెరిగాయి. 32,500 కోట్ల రూపాయలు గా నిలిచింది. ఐసిఐసిఐబ్యాంకు ఆరుశాం విప్రో అజీమ్ప్రేమ్జీ సంస్థకు విక్రయించింది. ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వం అధీనంలోని టీమ్సెక్కు విక్ర యించింది. ఇప్పటివరకూ కోల్ ఇండియా 15,199 కోట్లు, రిలయన్స్పవర్ 11,700 కోట్లు, డిఎల్ఎఫ్ 9188కోట్లు, రిలయన్స్పెట్రోలియం 8100 కోట్లు, ఐసిఐసిఐప్రులైఫ్ 6057కోట్లు,ఎన్‌హెచ్‌పిసి 6039 కోట్లు, ఎన్టిపిసి 5368 కోట్లు, కెయిర్న్ ఇండియా 5261కోట్లు, భారతిఇన్ఫ్రాటెల్ 4156కోట్లు, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్3025కోట్లు ఐపిఒల ద్వారా నిధుల సమీకరించాయి. తాజాగా ఐసిఐసిఐ ప్రులైఫ్ ఐపిఒ ఈక్విటీ మార్కెట్లలో హల్చల్ చేస్తోంది.