భారత్‌ ఐటి కంపెనీలకు రూపాయి షాక్‌!

IT E_PLOYEE1
IT Sector

భారత్‌ ఐటి కంపెనీలకు రూపాయి షాక్‌!

ముంబై: డాలరుతో రూపాయి పటిష్టంకావడంతో నాలుగోత్రైమాసికంలో ఐటి కంపెనీల రాబడులు దెబ్బతినే అవకాశం ఉంది. భారతీయ ఐటి కంపెనీల రాబ డులు అత్యధిక శాతం అమెరికా దేశంనుంచే అందులోనూ డాలర్‌ కరెన్సీ రూపంలోనే అత్యధికంగా వస్తున్నాయి. ఐటికంపెనీలకు డాలర్‌ రాబడులే వెన్నుదన్నుగా నిలుస్తున్నా యి. డాలర్‌తో రూపాయి మారకం విలువలు 65 రూపాయలవద్ద స్థిరపడిన నేపథ్యం లో రానున్న నాలుగోత్రైమాసిక రాబడులు ఐటి కంపెనీలకు తగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, విప్రో వంటి కంపెనీలు ఎక్కువ మార్జిన్లు రాబట్టే అవకాశం లేక పోవచ్చు. ఇప్పటికే గడచిన కొన్ని త్రైమాసికాల నుంచి కంపెనీలు ధరల ఒత్తిడికి లోనవుతూ వృద్ధి మందగిస్తోంది. డిజిటల్‌ టెక్నా లజీ విధానంలోమరింతగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

ఆర్థిక వేత్తల అంచనాల ప్రకారంచూస్తే నాలుగోత్రైమాసికంలో అమెరికా డాలరు 67నుంచి 67.5రూపాయల వద్దకు చేరే అవకాశం ఉంది. 65 రూపాయల నుంచి మెరుగుపడితే కంపెనీలు 100-130 బేసిస్‌ పాయింట్ల వరకూ మార్జిన్లలో తగ్గు దల ఉంటుందని అంచనా. భారతీయరూపాయి 64-65 రూపాయలవద్ద మరింత పటిష్టంగా ఉంటే ఐటిసేవల కంపెనీలు క్రమానుగతంగా అందుకు తగినట్లుగానే నష్టాలు చవిచూస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రనతి వాటాకు వచ్చే రాబడులు కనీసం ఐదు శాతం మేర ప్రభావంచూపిస్తాయని ఐటిరంగ నిపుణులు ప్రభుదాస్‌ లీలాధర్‌ నిపుణులు మధుబాబు వెల్లడించారు. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువలు 65.41గా నిలిచాయి. 2015 అక్టోబరునాటికి పటిష్టమైన కరెన్సీ మారకం విలువలు కొనసాగుతున్నాయి. రూపాయి మరికొంతకాలం పాటు పటిష్టంగా కొనసాగుతుందని, అందువల్ల ఐటి కంపెనీలు స్వల్పకాలికంగా కొంతరక్షణ కార్యాచరణ అమలు చేయా ల్సిందేనన్నారు.
ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, విప్రో సంస్థలు తమ త్రైమాసిక ఫలితాలు వరుసగా వచ్చే నెల 13, 12, 25 తేదీల్లో ప్రకటిస్తాయి. డిసెంబరు 31వ తేదీ నుంచి డాలరుతో రూపాయి మూడుశాతం పటిష్టం అయింది. ఈకంపెనీల షేర్లుకూడా ఎని మిది శాతం వరకూ క్షీణించే అవకాశం లేకపోలేదని, భారీ, మిడ్‌సైజ్‌ కంపెనీల స్థాయి లో ఈ తగ్గుదల నమోదవుతుందని కోటక్‌ సంస్థాగత ఈక్వి టీస్‌ విశ్లేషించింది. భారత్‌ రూపాయి డిసెంబరు నుంచి డాలరుతో పోలిస్తే మూడుశాతం పెరిగినట్లు తేలింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే భారత్‌ రూపాయి మెరుగుపడింది. అంతేకాకుండా 2018రాబడులపై కూడా ప్రభావం చూపు తుందని నిపుణుల అంచనా. తక్కువస్థాయి లాభదాయ కత తప్పదని ఐటిరంగ నిపుణులు చెపుతున్నారు.

2017 -18 సంవత్సరం కొంత ప్రకాశించినప్పటికీ రూపాయి విలువలపరంగా దిగువ స్థాయి రిస్క్‌లు ఎక్కువేనని చెపుతున్నారు. స్పాట్‌రేట్‌ 65.64 రూపాయలుగా డాలరు పలుకు తోంది. ప్రతి వాటాకు రాబడులపరంగాచూస్తే ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, విప్రో, హెచ్‌సిఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్ర కంపెనీలకు 5.8శాతం, 5.1శాతం, 5.4శాతం, 6.1 శాతం, 8.5శాతంగా దిగువస్థాయిలోనే ఉంటుందని కోటక్‌ నివేదిక చెపుతోంది. స్వల్పకాలి కంగా రూపాయి పటిష్టం అయినంత మాత్రాన ఐటికంపెనీలపై ప్రభావం పెద్దగా ఉండదని కొన్ని మిడ్‌సైజ్‌ ఐటికంపెనీల నిపుణులు చెపుతున్నారు. దీర్ఘకాలిక ప్రాతిపది కన చూస్తే మంచి లాభదాయకత ఉంటుందని అంటున్నారు. ఇక రూపాయి పెరుగు దల ప్రభావం నుంచి మాత్రం ఐటి కంపెనీలు తప్పించుకోలేవని నిపుణుల అంచనా.