భారత్‌-ఏ జట్టులో కెఎల్‌ రాహుల్‌కు చోటు

kl rahul
kl rahul

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌ లయన్స్‌తో జరిగే తొలి అనధికార టెస్టు మ్యాచ్‌ కోసం టీమిండియా ఆటగాడు కెఎల్‌ రాహుల్‌ ఇండియా-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఆంధ్ర రంజీ ఆటగాళ్లు రికీ భు§్‌ు, కెఎస్‌ భరత్‌ కూడా ఈ జట్టలో చోటు దక్కించుకున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌ కోసం 14మందితో కూడిన జట్టుని ప్రకటించింది. భారత్‌-ఏ జట్టుకు మహారాష్ట్ర ఆట గాడు అంకిత్‌ బావ్నె నాయకత్వం వహించనున్నాడు. తనపై విధిం చిన నిషేధాన్ని తాత్కాలికంగా బిసిసిఐ ఎత్తివేయడంతో ఇప్పటికే రాహుల్‌ ఇంగ్లాండ్‌ డయన్స్‌ జట్టుతో జరిగిన రెండు వన్డేల్లో ఆడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి రంజీ ఫైనల్‌ జరుగుతుం డటంతో ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన సౌరాష్ట్ర, విదర్భ జట్లకు చెందిన ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయలేదు. భారత సీనియర్‌ జట్టు పేసర్లు గాయపడితే వారి స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో యువ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌, వరుణ్‌ అరోన్‌కు జట్టులో చోటు కల్పించారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన వరుణ్‌ అరోన్‌ మళ్లీ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలని చూస్తుం డగా, ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అవేశ్‌ ఖాన్‌కు చోటు లభించింది. ఇండియా-ఏ జట్టు… అంకిత్‌ బావ్నే (కెప్టెన్‌), కెఎల్‌ రాహుల్‌, ఎఆర్‌ ఈశ్వరన్‌, ప్రియాంక పంచాల్‌, రికీ భు§్‌ు, సిద్ధేశ్‌ లాడ్‌, కెఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌),జలజ్‌ సక్సేనా, ఎస్‌ నదీం, మయాంక్‌ మర్కండే, నవదీప్‌ సైనీ, శార్ధూల్‌ ఠాకూర్‌, అవేశ్‌ ఖాన్‌, వరుణ్‌ అరోన్‌.