భారత్‌, ఇరాన్‌ మధ్య కీలక ఒప్పందాలు

importent agiments
importent agiments

న్యూఢిల్లీ: భారత్‌, ఇరాన్‌ల మధ్య ఇవాళ పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ, ప్రధాని నరేంద్ర మోది భేటీ అయ్యారు. చర్చల అనంతరం సుమారు తొమ్మిది అగ్రిమెంట్లపై సంతకాలు జరిగాయి. చాబహర్‌ పోస్టల్‌ పోర్టు వినియోగం, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం లాంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. రోహానీ ,మోదీలు కలిసి సంయుక్తంగా పోస్టల్‌ స్టాంపులను కూడా రిలీజ్‌ చేశారు. రోహానీ రాక వల్ల రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని మోది అన్నారు. ప్రెసిడెంట్‌ రౌహానీ విజన్‌ను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ద్వైపాక్షిక ఆర్ధిక సహకారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ప్రధాని మోది చెప్పారు. ఇరు దేశాల మధ్య మైత్రి పెరిగిందని ఇరాన్‌ అధ్యక్షుడు రౌహానీ అన్నారు.