భారత్‌లో 12% తగ్గిన పసిడి డిమాండ్‌

GOLD
GOLD

ముంబయి: భారత్‌లో పసిడి డిమాండ్‌ 12శాతం క్షీణించింది. ఈ ఏడాది మొదటిత్రైమాసికంలో చూస్తే 115.6 టన్నులుగా ఉంది. గత ఏడాది ఇదేకాలంలో చూస్తే ధరలు పెరుగుదలకారణంగా డిమాండ్‌ తగ్గిందని అంచనావేస్తున్నారు. మొత్తం బంగారం డిమాండ్‌ 131.2 టన్నులుగా జనవరి మార్చి కాలంలో ఉంటుందని ప్రపంచ పసిడి మండలి అంచనావేసింది. మొదటిత్రైమాసికం పసిడిడిమాండ్‌ ధోరణులు పేరిట ఒక నివేదికను విడుదలచేసింది. విలువలపరంగాచూస్తే బంగారం డిమాండ్‌ 8 శాతం దిగజారి రూ.31,800 కోట్లకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో రూ.34,440 కోట్లుగా ఉంది. ఈ తగ్గుదలకు కేవలం ఒకేకారణం అని చెప్పలేమని, అనేక కారణాలున్నాయని చెపుతున్నారు. స్థానిక మార్కెట్లలో ధరలు పెరుగుదల, శుభకార్యాలు, ఇతర వేడుకలకు సంబంధించి తక్కువ వినియోగం వంటివి కొత కారణం. గత ఏడాదితోపాటు పోలిస్తే పెళ్లిళ్లు శుభకార్యాల సీజన్‌కూడా తక్కువగానే ఉన్నట్లు పసిడిమండలి అంచనావేసింది. అలాగే కేంద్ర బడ్జెట్‌లో దిగుమతిసుంకం తగ్గుతుందన్న అంచనాలు కూడా మృగ్యం అయ్యాయని ప్రపంచ పసిడిమండలి ఎండి పిఆర్‌ సోమసుందరం వెల్లడించారు. జిఎస్‌టి అమలు అసంఘటితరంగంలోసైతం కొంత ప్రభావంచూపించింది. దీనివల్ల డిమాండ్‌ తగ్గిందనే చెప్పాలని ఆయన అన్నారు. అలాగే వాణిజ్యంలో సెంటిమెంట్‌ కొంత తగ్గింది. ముఖ్యంగా పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు కుంభకోణంతో మరింత దిగజారింది. ఈప్రభావం అక్షయతృతీయవరకూ కొనసాగింది. ఆభరణాలడిమాండ్‌ భారత్‌లో మొదటిత్రైమాసికంలో 12శాతం దిగజారి 87.7 టన్నులకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 99.2 టన్నులుగా ఉంది. విలువలపరంగాచూస్తే డిమాండ్‌ మొదటిత్రైమాసికంలో 7శాతం తగ్గి రూ.24,130 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో రూ.26,050 కోట్లుగా ఉంది. జనవరి మార్చి త్రైమాసికంలో మొత్తం పెట్టుబడుల డిమాండ్‌పసైతం 13శాతం తగ్గింది.32 టన్నులనుంచి 27.9టన్నులకు తగ్గింది. విలువలపరంగాచూసినా బంగారం పెట్టుబడుల డిమాండ్‌ మొదటిత్రైమాసికంలో రూ.7660 కోట్లుగా ఉంది. తొమ్దిమిశాతం క్షీణించిందని అంచనా. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో రూ8390 కోట్లుగా ఉంది. మొత్తం రీసైకిల్‌చేసిన బంగారంకూడా 3శాతం తగ్గింది. 2018 తొలిత్రైమాసికంలో 14.1 టన్నులుగా ఉంటే గత ఏడాది ఇదేకాలంలో 14.5 టన్నులుగా ఉంది. సహజంగానే భారత్‌లో మొదటిత్రైమాసికం అంత గిరాకీ ఉన్న కాలంగా కనిపించదు. ప్రజలు సాధారణంగా పన్నుల ప్రయోజనాలకోసమే ఎక్కువప్రాధాన్యతనిస్తారు. పనునలు చెల్లించినతర్వాత మిగిలినార్ధికసంవత్సరంలో బంగారం వెండి లాంటికొనుగోళ్లుచేస్తారని సోమసుందరం వెల్లడించారు. ఇక బంగారం దిగుమతులు 50శాతం క్షీణించాయి. 153 టన్నులుగా ఉన్నాయి. అదే గత ఏడాది ఇదే కాలంలో 260 టనున్లఉగా నిలిచింది. మొత్తం దిగుమతులు వినియోగదారులనుంచి డిమాండ్‌ తగ్గడం, జిఎస్‌టి ప్రారంభం కాలం కావడమేనని అంచనావేస్తున్నారు. అలాగే బడెఓ్జట్‌లో కొంతమేర బంగారం కొనుగోళ్లపై పన్నులకోత తగ్గిస్తారన్న అంచనాలుసైతం ఇందుకు దోహదంచేసాయి. ఇక ఇదిగుమతులపరంగా చూస్తే ఈ ఏడాది ఇప్పటివరకూ ఉన్న ధోరణులే కొనసాగుతాయని అఈన్నారు. పూర్తి కాలానికిగాను బంగారం డిమాండ్‌ భారత్‌లో 700-800 టన్నులుగా ఉంటుందని అంచనా. మంచి రుతుపవనాలు కొనసాగి ఎక్కువ గ్రామీణ ఆదాయం పెరిగి మొత్తం జిడిపి వృద్ధిలో కొనసాగితే మంచి డిమాండ్‌ ఉంటుందని పసిడిమండలి ఎండి అన్నారు. దీర్ఘకాలంలో పసిడి డిమాండ్‌మరికొంతపెరుగుతుందని అంచనా.