భారత్‌లో వ్యాపారం చేయడం ఇప్పుడు చాలా సులభం: మోదీ

PM Modi
PM Modi

ఢిల్లీ: ప్రపంచంలోనే భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన వరల్డ్‌ ఫుడ్‌
ఇండియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతదేశంలో వ్యాపారం చేయడం ఇప్పుడు చాలా సులభమని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలో
పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పెట్టుబడిదారులను ఆయన కోరారు. జీఎస్‌టీ అమలుతో దేశంలో అనేక పన్నులు రద్దయ్యాయని, ప్రపంచ బ్యాంక్‌కు
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత్‌లో దాదాపు 30ర్యాంకుల పైకి ఎగబాకిందని, ఇప్పటివరకూ ఇదే భారత్‌కు వచ్చిన అత్యున్నత ర్యాంకు అని
స్పష్టం చేశారు.