భారత్‌లో విద్యుత్‌పరికరాల మార్కెట్‌ 30బిలియన్‌ డాలర్లు

HITEX
AP Tyapsi Chairman Ravindra Modi

విద్యుత్‌ పరికరాల మార్కెట్‌ 30బిలియన్‌ డాలర్లు

హైదరాబాద్‌, జనవరి 6: భారత్‌లో ఎలక్ట్రిక్‌ యంత్రపరికరాల మార్కెట్‌ వచ్చే ఐదేళ్లలో 25నుంచి 30 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని ఆర్థికరంగ నిపు ణులు చెపుతున్నారు. ప్రభుత్వపరంగా కూడా విద్యుత్‌ఉత్పత్తి 78 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెంచాలన్న లక్ష్యం నిర్ణయించడంతో దేశంలో విద్యు త్‌ యంత్రపరికరాలకు భారీ డిమాండ్‌ ఉంటుందని ఎఫ్‌ట్యాప్సీ ఛైర్మన్‌ రవీంద్రమోడీ ఇతర నిపుణులు పేర్కొన్నారు. హైటెక్స్‌లో విద్యుత్‌ఎక్స్‌పోను మైహోమ్స్‌ ఎండి జూపల్లి రామేశ్వరరావు ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో విద్యుత్‌రంగ నిపుణులు మాట్లాడుతూ విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ట్రాన్స్‌మిషన్‌ పంపిణీ రంగంలోనే పెట్టుబడులు 85 బిలియన్‌ డాలర్ల వరకూ అవసరం అవుతాయని, ట్రాన్స్‌మిషన్‌రంగంలో 45 బిలియన్‌ డాలర్లు, పంపి ణీరంగంలో 70 బిలియన్‌ డాలర్లకు ఈ పెట్టుబడులు పెరుగతాయని అంచనా ఉందని అన్నారు. 2022 నాటికి ట్రాన్స్‌మిషన్‌ పంపిణీ రంగం టర్నోవర్‌ 70 నుంచి 75 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశం ఉంద ని నిపుణులు వెల్లడించారు. 2021 నాటికి భారత్‌లో విద్యుత్‌ వినియోగం 1300 టెరావాట్లుగా ఉండగల దని అంచనా ఉంది. 12వ పంచవర్ష ప్రణాళిక అంచనాలనుచూస్తే సాలీనా ఆరుశాతంపెరిగి 100 గిగావాట్లకు పెరుగుతుందని ఈ రంగ నిపుణులు చెపుతున్నారు. ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్రమోడీ, మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డా.రామేశ్వరరావుజూపల్లి, సైనర్జీ ఇన్‌ఫ్రా సిఇఒ వి.శ్రీనివాస్‌ ఇతర ప్రము ఖులు పాల్గొన్న ఈ ఎక్స్‌పోమూడురోజులపాటు కొనసాగుతుంది. ఫైన్‌క్యాబ్‌, పాల్లీక్యాబ్‌, ఎల్‌అండ్‌టి, సుధాకర్‌ పైప్స్‌, బిసిహెచ్‌, హెచ్‌పిఎల్‌, ఫిలిప్స్‌, హ్యావెల్స్‌, విప్రో, ఫినోలెక్స్‌ వంటి మెగా కంపెనీలు ఈప్రదర్శనలో ఉత్పత్తుల తో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెద్దనోట్ల రద్దుప్రభావం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఎక్కువశాతం పంపిణీ, ట్రాన్స్‌మిషన్‌, కేబుల్‌, వైరింగ్‌ ఉత్పత్తులు, స్విచ్చింగ్‌ ఉత్పత్తులు, ఫిట్టింగ్‌, ఆటోమేటిక్‌ మెషినరీ, ఆటోమేషన్‌ సిస్టమ్స్‌ రోబోటిక్స్‌, విద్యుత్‌ సామగ్రి ఏర్పాటు యంత్రపరికరాలు, వోల్టేజి స్టెబిలైజర్లు, గృహాలు, భవనాల్లో విద్యుదీకరణ యంత్రా లు, లిప్టులు, ఎస్కలేటర్లు, ఎయిర్‌కండి షనింగ్‌ వ్యవస్థలు మొత్తం ప్రదర్శనలో ఉంచారు. విద్యుత్‌ కాంట్రాక్టర్లు, విద్యుత్‌ చట్టసంస్థల అధికారులు, ఇంజనీర్లు, ఇపి ఎస్‌ కాంట్రాక్టర్లు, పారిశ్రామికరంగ నిపుణు లు, మెటీరియల్‌ సప్లయర్లు, ఎస్కోస్‌, పవర్‌ట్రేడింగ్‌ కంపెనీలు, విద్యుత్‌ బోర్డులు వంటివి ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు విద్యుత్‌లోటు కీలకంగ ఆమారిందని, పీక్‌ సమయాల్లో విద్యుత్‌ కోతలు సగటున 11శాతం, 12శాతంగా ఉన్నాయని నిపుణులు వెల్ల డించారు. మౌలికవనరులరంగం వృద్ధికి విద్యుత్‌ కొరత తీవ్ర విఘాతంగా మారిందని నిపుణుల అంచనా. దేశంలోని మొత్తం విద్యుత్‌ ఉత్పత్తులన్నిం టినీ ఒకేవేదికపైకి తెచ్చి కొనుగోలుదారులు, ఉత్పత్తిదారుల్లో అవగాహన పెంచేందుకు ఈ ఎక్స్‌పో ఎంతో ఉపకరిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.