భారత్‌లో ఫేస్‌బుక్‌ ‘ఎక్స్‌ప్రెస్‌వైఫై సేవలు

FACEBOOK1
FACEBOOK

భారత్‌లో ఫేస్‌బుక్‌ ‘ఎక్స్‌ప్రెస్‌వైఫై సేవలు

న్యూఢిల్లీ, మే 7: డేటా వినియోగం మరింత అందుబాటులోకి తెచ్చేందుకు సోషల్‌ వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ తాజాగా ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంతో ఎక్స్‌ప్రెస్‌ వైఫైను అందుబాటులోనికి తెస్తోంది. పబ్లిక్‌ హాట్‌ స్పాట్స్‌ ఏర్పాటుచేసి గ్రామీణప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని అంచనా. ఫేస్‌బుక్‌ ఉచిత బేసిక్స్‌ పథకాలకు తెరదించుతూ ఫేస్‌బుక్‌ ఎయిర్‌టెల్‌తో కలిసి ఎక్‌ప్రెస్‌ వైఫై చెల్లింపువిధానంలో అమలుచేస్తోంది. భాగస్వామ్య టెలికాంఆపరేటర్లతో కలిసి రోజువారి, వారం వారం, నెలవారీ డేటాప్యాక్‌ లను అందుకోవచ్చు. ఇప్పటికే భారతి ఎయిర్‌టెల్‌తో కలిసి 20వేల వైఫై హాట్‌స్పాట్స్‌ ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ లో 39 కోట్ల మంది మాత్రమే నెట్‌ వినియోగంలో ఉన్నారు. ఇప్పటివరకూ అందని ప్రాంతాలకు నెట్‌ సౌకర్యాన్ని అందించేందుకు నిర్ణయించామని ఆసియా పసిఫిక్‌ హెడ్‌ మునిష్‌ సేథ్‌ వెల్లడించారు. ఇంటర్నెట్‌ సర్వీస్‌ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తున్నామని, 500కు పైగా స్థానిక ఔత్సాహిక రిటైలర్లను భాగస్వాములను చేసుకుంటున్నట్లు వివరించారు. స్మార్ట్‌ఫోన్‌ వినియో గంతోను, రిలయన్స్‌జియో రాకతోను నెట్‌ వినియోగం భారీగా వృద్ధిచెందింది. టెక్‌ దిగ్గజం గూగుల్‌ కూడా ఇంటర్నెట్‌ను పబ్లిక్‌వైఫై హాట్‌స్పాట్స్‌ద్వారా రైల్వేస్టేషన్లలో అందిస్తోంది. ఫేస్‌బుక్‌ కేవలం పరి ష్కారాలు మాత్రం అందిస్తుందని, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ధరలు నిర్ణయించి అందుబాటులోనికి తెస్తారన్నారు. ప్రస్తుతంనాలుగు భారతీయ రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మేఘాలయ ల్లో 700కుపైగా హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించింది. 2015నుంచే ఎక్స్‌ప్రెస్‌ వైఫైపై భారత్‌ లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉత్తరాఖండ్‌లో ఎయిర్‌జల్ది, ఎల్‌ఎంఇఎస్‌ రాజస్థాన్‌, గుజరాత్‌లో టికోనా, శైలిధర్‌ కంపెనీ మేఘాలయలోను ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ వైఫై అందిస్తాయన్నారు. మరో నాలుగు దేశాలు కెన్యా, టాంజానియా, నైజీరియా, ఇండోనేసియాల్లో ఎక్స్‌ప్రెస్‌ వైఫై అందుతుందన్నారు.