భారత్‌లో పోర్షే కొత్త మోడల్ మకాన్

భారత్‌లో పోర్షే కొత్త మోడల్ మకాన్
న్యూఢిల్లీ,నవంబరు 15:జర్మనీ లగ్జరీకార్ల తయారీ సంస్థ పోర్షే కొత్తగా భారత్‌కు తక్కువధరతో కూడిన ఎస్యువి మకాన్‌ను విడుదల చేసింది. ముంబై ఎక్స్షోరూంధరగా రూ.76.84 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. మకాన్ ఆర్4గా చెపుతున్న ఈ కంపాక్ట్ ఎస్యువి ఏడుస్పీడ్ ఫిడికె డ్యూయల్ క్లచ్ట్రాన్స్మిషన్తోను, పోర్షే కమ్యూనికేషన్ మేనేజ్ మెంట్ తాజా వెర్షన్‌తో వస్తోంది. ఇంటీరియర్, ఎక్స్‌టీ రియర్లతో అనేక అధునాతన ఫీచర్లను పెంచింది.
మకాన్రేంజిలో మరింతగా స్పోర్ట్స్‌కార్ లైన్అప్ కని పిస్తోంది. పోర్షే ఇం డియాడైరెక్టర్ పవన్ షెట్టి మాట్లాడుతూ ఆకర్షణీయమైన ధర ల్తో భారత్మార్కెట్ లో మరింత ముం దుకు పోతామని ఆయన అన్నారు. నాలుగు సిలిం డర్ టర్బోఛార్జిడ్ ఇంజన్ ఎంట్రీలెవల్ మకాన్ పని తీరుకు దర్పణం పడుతున్నది. ఈఏడాది అంతకు ముందే కంపెనీ తనతాజావెర్షన్ 911మోడల్‌ను భార త్లో విడుదల చేసింది.
వీటిధరలు ఢిల్లీఎక్స్‌షోరూం ధరలుగా 1.42 కోట్ల నుంచి 2.66 కోట్ల వరకూ ఉన్నాయి. పోర్షేలగ్జరీ కార్ల పరంగా ఎస్‌యువిలు ఎక్కువ ఉత్పత్తిచేస్తోంది. కేమాన్, కేయిన్నె, మకాన్, బాక్స్టర్, 911, పానమెరా వంటి కార్లు భారత్‌లో కోటి రూపాయల నుంచి రూ.3కోట్లవరకూ ఉన్నాయి.