భారత్‌లో నాలుగు టెస్టులు ఆడబోతున్నాం: స్మిత్‌

SMITH
SMITH

భారత్‌లో నాలుగు టెస్టులు ఆడబోతున్నాం: స్మిత్‌

 

కోహ్లీ ఏకాగ్రత చెదిరితే లాభం సిరీస్‌ గెలిస్తే గొప్ప, తొలి టెస్టు 23న ఆరంభం మెల్‌బోర్న్‌: టీమిండియా సొంత గడ్డపై నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.కాగా ఫిబ్రవరిలో ఆరంభమయ్యే ఈ సిరీస్‌లో కోహ్లీ సేనను అడ్డుకోవడం ఆసీస్‌కు సవాలే.అందుకే సిరీస్‌కు ఇప్పటి నుంచి ఆసీస్‌ మానసికంగా సన్నద్ధమవుతుంది.ఆ సిరీస్‌ సందర్భంగా భారత్‌ కెప్టెన్‌ కోహ్లీ కొంత కొపంగా ఉండాలని ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కోరుకుంటున్నాడు. కోహ్లీ కోపంగా ఉంటే ఆటపై అతడి ఏకాగ్రత చెదురుతుం దని, అది తమకు లాభం చేకూరుస్తుందని స్మిత్‌ ఉద్దేశ్యం.అతడు ప్రపంచ స్థాయి ఆటగాడు.

గత 18 నెలలుగా భారత్‌ జట్టును బాగా నడిపిస్తు న్నాడు.కాగా ఈ సమయంలో భారత్‌ చాలామ్యాచ్‌లను గెలిచింది.ఆ సమయంలో సొంతగడ్డపై భారత్‌ చాలా క్రికెట్‌ ఆడిందికూడా అని స్మిత్‌ పేర్కొన్నాడు. కాగా మైదానంలో కోహ్లీ చాలాభావోద్వేగంతో ఉంటాడు. అతడికి కొంత కోపంవచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తాం. అపుడు అతడిఏకాగ్రత చెదురు తుంది.అతడికి చికాకు తెప్పిస్తే భారత్‌ కొంత బలహీనంగా మారే అవకాశం ఉంది అని వివరించాడు.మేం ఫిబ్రవరిలో భారత్‌ వెళ్తున్నాం.అది చాలా కఠిన పర్యటన అనడంలో ఎలాంటి సందేహం లేదు అని స్మిత్‌ పేర్కొ న్నాడు. నాలుగుటెస్టులు ఆడబోతున్నాం. ఇది మా జట్టుకు గొప్ప అవకాశం. కాగా భారత్‌లో సిరీస్‌గెలుచుకుంటే చాలాగొప్పగా ఉంటుంది అని వివరిం చాడు. తొలి టెస్టు ఫిబ్రవరి 23న ఆరంభం అవుతుంది.