భారత్‌లో ఐసిస్‌ కుట్రలు

weapons
weapons

హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా వందచోట్ల దాడులకు పథకాలు
ప్రముఖుల హత్యలకు వ్యూహాలు, వరుస పేలుళ్ల కోసం రిమోట్‌ బాంబుల తయారీ
దాడుల కోసం తొలిసారిగా దేశవాళి లాంచర్‌ రూపకల్పన
ఢిల్లీ, యుపిలో దాడులు… 10 మంది ముష్కరుల అరెస్టు
పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదర్థాలు స్వాధీనం
హైదరాబాద్‌: మధ్య ఆసియా దేశాలతో పాటు పలు యూరప్‌ దేశాలలో మారణ హోమం సృష్టిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్స్‌ (ఐసిస్‌) ఉగ్రవాదులు భారత్‌లో భారీ విధ్వంసాలకు పన్నిన కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) అధికారులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల లో 17 చోట్ల సోదాలు నిర్వహించిన నియా అధికారులు పది మంది ముష్కరులను అరెస్టు చేయడంతో పాటు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో పాటు నాటు తుపాకులు, తూటాలు, దేశవాళి లాంచర్‌ను స్వాధీనం చేేసుకున్నారు. హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా వంద చోట్ల దాడులు చేసేందుకు రిమోట్‌ బాంబులు త యారు చేసుకోవడంతో పాటు, ప్రముఖులను హత్య చేసేందుకు వ్యూహాలు పన్నిన ఐసిస్‌ ముష్కరులు, పగడ్బందీ పథకం రచించి ఇందుకోసం హర్కత్‌ ఉల్‌ హర్బ్‌ ఎ ఇస్లాం అనే మాడ్యూల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఐసిస్‌ వ్యూహాలపై నిరంతరం నిఘా వుంచిన నియా ముష్కరుల ఆటకట్టించడంతో పాటు పెద్ద ముప్పును తప్పించారు.
ఇండియాలో విధ్వంసాలకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న ఐసిస్‌ ముష్కరులు మరోమారు కుట్రలు పన్నారు. దేశ వ్యాప్తంగా వంద చోట్ల పేలుళ్లకు పాల్పడి భయోత్పాం సృష్టించాలని భారీ వ్యూహాలు పన్నిన ఐసిస్‌ ఇదే సమయంలో ప్రముఖులను హత్య చేసేందుకు కూడా పథకాలు రచించింది. ఇందుకోసంహర్కత్‌ ఉల్‌ హర్బ్‌ ఎ ఇస్లాం అనే మాడ్యూల్‌ను ఏర్పాటు చేసుకున్న ఆ సంస్థ పెద్ద ఎత్తున యువతను భర్తీ చేసుకుంది. అయితే ఐసిస్‌పై నిఘా వుంచిన నియా అధికారులు ఈ కుట్రలను భగ్నం చేశారు. ఐసిస్‌ కుట్రలను చేధించే క్రమంలో నియా అధికారులు బుధవారం నాడు ఢిల్లీతో పాటు యుపిలో 17 చోట్ల దాడులు చేయడంతో పాటు పది మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఐసిస్‌ కుట్రలను అమలు చేసేందుకు నాయకుడుగా వున్న ఉత్తరప్రదేశఖలోని అమ్రోలాకు చెందిన ముఫ్తీ మహమ్మద్‌ సొహైల్‌ అలియాస్‌ హజ్‌రత్‌ను మొదట అరెస్టు చేశారు. ఇండియాలో పేలుళ్లకు పాల్పడడం, ప్రముఖులను హత్య చేయడం కోసం ఇతను ని ధులను సమకూర్చుకోసాగాడు. ఇందుకోసం కొందరిని నియమించుకున్న హజ్‌రత్‌ యువతను ఐసిస్‌లో చేరేందుకు ప్రోత్సహించాడు. ఇదే సమయంలో ఇతను ఐ ఇడి బాంబులను తయారు చేశాడు. ఈ బాంబులను ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా జనం ఎక్కువగా వుండే వంద చోట్ల పేల్చేందుకు పథకాలు రచించాడు. ఇతని ముఖ్య టార్గెట్‌ ఢిల్లీగా తేలింది. ఢిల్లీలో వరుస పేలుళ్లకు కుట్ర చేశాడు. కాగా హజ్‌రత్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా యుపిలోని 11 ప్రాంతాలు, ఢిల్లీలోని ఆరు ప్రాంతాలలో నియా అధికారులు బుధవారం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా సోదాలు నిర్వహించారు. యుపిలోని అమ్రోలాలలో ఆరు చోట్ల, ల క్నోలో రెండు చోట్ల, హపూర్‌లో రెండు చోట్ల మీరట్‌లో ఒకచోట సోదాలు నిర్వహించారు. కాగా ఢిల్లీలోని జఫ్రాబాద్‌, సీలంపూర్‌లలో ఆరోచోట్ల సోదాలు జరి గాయి. ఈ సందర్బంగా ఢిల్లీకి చెందిన అనాస్‌ యూనిస్‌ (24), రషీద్‌ జాఫర్‌ రాక్‌ అలియాస్‌ జాఫర్‌ (23), జుబేర్‌ మాలిక్‌ (20), జాయిద్‌ మాలిక్‌ (22), మ హమ్మద్‌ ఆజం (35), యుపిలోని అమ్రోలాకు చెందిన సయీద్‌ (28), రయీస్‌ అహ్మద్‌ (27), సకీత్‌ ఇఫ్తేకార్‌ (26), మహమ్మద్‌ ఇర్షాద్‌ (26)లను నియా అ ధికారులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 25 కిలోల పేలుడు పదార్థాలు, (సల్ఫర్‌, అమోనియం నైట్రేట్‌, పొటా షియం నైట్రేట్‌, చక్కెర పేస్ట్‌ల మిశ్రమంతో కూడిన పేలుడు పదార్థాలు), 12 నాటు తుపాకులు, 150 తూటాలు, ఒక దేశవాళి రాకెట్‌ లాంఛర్‌, పేలుళ్లకు పాల ్పడేందుకు 112 అలారం గడియారాలు, 91 మొబైల్‌ ఫోన్లు, సర్క్యూట్‌ బ్యాటరీలు, బ్యాటరీలు లభించాయి. వీటితో పాటు పేలుళ్ల కోసం అవసమయ్యే 51 పైపు లు, కంట్రోల్‌ కార్‌ ట్రిగరింగ్‌ యం త్రం, వైర్‌లెస్‌ పరికరాలు, రిమోట్‌ స్విచ్‌లు, 134 సిం కార్డులు, మూడు ల్యాప్‌టాప్లు, నాలుగు కత్తులు, ఐసిస్‌కు సంబం ధించిన సాహిత్యం, ఏడున్నర లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై 120 (బి), 121, 121ఎ, 122, పేలుడు పదార్థాల చట్టంలోని 4, 5 సెక్షన్లు, ఉగ్రవాద నిరోధక చట్టంలోని 17, 18, 18బి, 20, 38, 39 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులను ఢిల్లీలోని పాటియాల కోర్టులో హాజరు పరిచి అక్క డి నుంచి తీహార్‌ జైలుకు తరలించారు.
ఐసిస్‌ కుట్రల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం
ఇదిలావుండగా ఐసిస్‌ కుట్రల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, యుపిలో 10 మంది ఐసిస్‌ ఉగ్రవాదు లు పట్టుబడిన నేపథ్యంలో వారి సానుభూతిపరులు ఎవరైనా ఇక్కడ వుండివుండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఐసిస్‌ సానుభూతిపరుల కోసం ఆరా తీస్తున్నారు. గతంలో ఐసిస్‌ కేసుల్లో వున్న వారిని విచారించసాగారు.