భారత్‌లో అన్ని మతాలను సమానంగా చూస్తాం: మోది

Abdullah met ramnath kovind, modi
Abdullah met kovind, modi

న్యూఢిల్లీ: మతంపై పోరాటం చేయడం కాదు, ఉగ్రవాదంపై పోరాటం చేయాలని ప్రధాని నరేంద్ర మోది పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఇవాళ ఇస్లామిక్‌ హెరిటేజ్‌ -ప్రమోటింగ్‌ అండర్‌ స్టాండింగ్‌ అండ్‌ మాడరేషన్‌ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి మతం మానవ విలువలను ప్రమోట్‌ చేస్తుందని ,భారత్‌లో అన్ని మతాలను సమానంగా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోర్డాన్‌ కింగ్‌ రెండవ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. బహుళత్వానికి భారత ప్రజాస్వామ్యం చిహ్నమన్నారు. నమ్మకమే మానవాళిని ఒక్కటిగా ఉంచుతుందని కింగ్‌ అబ్దుల్లా తెలిపారు. ఆ తర్వాత మోది, జోర్డాన్‌ కింగ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు.