భారత్‌మార్కెట్‌కు జీప్‌ కంపాస్‌ ఎస్‌యువి

JEEEP11
Jeep

భారత్‌ మార్కెట్‌కు జీప్‌ కంపాస్‌ ఎస్‌యువి

ముంబై, నవంబరు 20: ఫియట్‌క్రిస్లర్‌ఆటోమొబైల్స్‌ ఇండియా నుంచి సుమారు 100 దేశాలకు సరి పడా జీప్‌కంపాస్‌ కొత్త ఎస్‌యువిలను ఉత్పత్తి చేస్తోంది. భారత్‌తోపాటు చైనా, బ్రెజిల్‌, మెక్సికో ఉత్పత్తికేంద్రాల నుంచి వంద దేశాలకు తమ జీప్‌ కంపాస్‌ ఎస్‌యువిలను అందిస్తుందని అంచనా. కొత్తగా ఉత్పత్తిచేసిన జీప్‌కంపాస్‌ ప్రపంచ వ్యాప్తం గా మంచి మార్కెట్‌ వాటా సాధిస్తుందన్నారు. జీప్‌ బ్రాండ్‌ హెడ్‌ మైక్‌ మేన్నీల మాట్లాడుతూ ప్రీమి యం లుక్‌తోకూడిన అధునాతన టెక్నాలజీ, భద్ర తాఫీచర్లు జీప్‌కంపాస్‌ ఎస్‌యువిలో మరిన్ని ఉన్నా యన్నారు. వచ్చే ఏడాది మధ్యలో జీప్‌ కంపాస్‌ను విడుదలచేస్తామని, మొత్తం మూడు వెర్షన్‌లలో లభిస్తుందన్నారు. జీప్‌ యాక్టివ్‌డ్రైవ్‌ సెలెక్‌ట్రెర్ర యిన్‌ నాలుగు వర్సస్‌ నాలుగు సిస్టమ్‌తో వస్తోం ది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినత తట్టుకుని నిలబడగలిగే వాహనంగా జీవప్‌ కంపాస్‌ నిలుస్తుంని మేన్లీ వెల్లడించారు. 3.5 లేదా ఏడు అంగుళాల లెడ్‌డ్రైవర్‌ సమాచార డిస్ప్లే ఉంటుంది. ఏడు అంగుళాల డిఐడి అతిపెద్దదిగా ఏర్పాటు చేసారు. 70కిపైగా అధునాతన భద్రతాపూర్వక ఫీచర్లు జీప్‌కంపాస్‌ ఎస్‌యువిలో ఉన్నట్లు ముఖ్య డిజైన్‌ అధికారి వివరించారు. ఎఫ్‌సిఎగా పిలుస్తు న్న కంపెనీ అబార్త్‌, ఆలాఫ్ర రోమియో, క్రిస్లర్‌, డాడ్జ్‌, ఫియట్‌, ఫియట్‌ ప్రొఫెషనరల్‌, జీప్‌, లాన్సియా, రామ్‌, ఎస్‌ఆర్‌టి బ్రాండ్లు లగ్గజరీ కార్లు మసేరాతి బ్రాండ్లపై విడుదలచేసి విక్రయి స్తోంది. 75ఏళ్ల ఘనమైన వారసత్వంతో జీప్‌ బ్రాండ్‌ను అభివృద్ధిచేస్తూ వచ్చిన ఎఫ్‌సిఎ తాజాగా జీప్‌ కంపాస్‌ ఎస్‌యువిని మార్కెట్‌కు తెస్తోంది. ప్రపంచంలోని కస్టమర్‌ డిమాండ్‌ను తట్టుకునేం దుకు వీలుగా గ్లోబల్‌జీప్‌ వాహనం చెరోకీ, కంపాస్‌, గ్రాండ్‌, చెరోకీ, రెనెగేడ్‌, రాంగ్లర్‌, రాంగ్లర్‌ అన్‌ లిమిటెడ్‌ వంటి వెర్షన్లు ఉన్నాయి. ఎడమ, కుడిచేతి డ్రైవింగ్‌ వాటంతో ఉన్నవాటిని ఉత్తరఅమెరికా బయటి మార్కె ట్లలో లభిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌సిఎ జీప్‌ రాంగ్లర్‌ ను, జీప్‌గ్రాండ్‌ చెరోకిని పూర్తిగా నిర్మించిన యూని ట్లుగా దిగుమతి చేసుకని భారత్‌లో 2017 మధ్య స్తంకల్లా విక్రయిస్తుందని మైక్‌మ్యేన్లీ వెల్లడించారు.