భారత్‌కు 439 పరుగుల అధిక్యత

India Srilanka Test Match-2
India Srilanka Test Match

భారత్‌కు 439 పరుగుల అధిక్యత

కొలంబో :  రెండో టెస్టు తొలి ఇన్సింగ్స్‌ శ్రీలంక 183 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు భారత్‌ 622/9 పరుగులకు డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 439 పరుగుల అధిక్యత లభించింది. 50/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించిన లంకను భారత్‌ ధీటుగా ఎదురించింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లపై విరుచుకుపడ్డారు. డిక్‌వెల్‌ (51) మినహా బ్యాట్స్‌మెన్లెవరూ ఆశించదగ్గ స్కోరు చేయలేకపోయారు. అశ్విన్‌ 5 వికెట్లతో రాణించగా, షమీ, జడేజా చెరో రెండు, ఉమేష్‌ యాదవ్‌ ఞక వికెట్‌ పడగొట్టారు.