భారతీయ దంతవైద్య మండలిలో రేవతికి చోటు
భారతీయ దంతవైద్య మండలిలో రేవతికి చోటు
పెదకాకాని (గుంటూరుజిల్లా): భారతీయ దంతవైద్య మండలి కార్యనిర్వాహక సభ్యురాలిగా విజయవాడ కు చెందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ పి.రేవతి ఎంపికయ్యారు.దేశవ్యాప్తంగా ఏడుగురు సభ్యులతో కూడిన దంతవైద్య మండలిని భారత దంతవైద్య సంఘం సభ్యులు ఎన్నుకుంటారు.తొలత అధ్యక్ష పదవికి ఎంపిక పూర్తి చే స్తారు.ఆయన సమర్ధ వంతమైన కమిటిని ఎంపికచేసి స్థానం కల్పిస్తారు.దేశవ్యాప్తంగా వేలాదిమంది దంతవైద్యులు ఈ కమిటిలో స్థానంకోసం ప్రయత్నిస్తుంటారు.గతంలో తెలుగువారైన తక్కెళ్ళపాడు దంతవైద్య కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ లింగమనేని కృష్ణప్రసాద్ భారతీయ దంతవైద్య మండలి అధ్యక్షులుగా కొనసాగారు.ఆ తరువాత తెలుగు వారుగా అదీ తొలి తెలుగు మహిళగా డాక్టర్ రేవతి సభ్యురాలిగా ఎంపిక కావడం విశేషం.డాక్టర్ పి.రేవతి అమరా వతి రాజధాని జిల్లాలైన గుంటూరు,విజయవాడలకు చెందినవారు.ప్రస్తుతం ఆమె గుంటూరు జిల్లా పెదకాకానిలో ని తక్కెళ్ళపాడు సిబార్ దంత వైద్యశాలలో ఆర్ధోడాంటిక్స్ విభాధిపతిగా పనిచేస్తున్నారు.విజయవాడ అట్కిస్సన్
హైస్కూల్లో తొలి ప్రాధమిక విద్యను పూర్తిచేసి,సిద్దార్ధ మహిళా కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించారు.అక్కడి
నుంచి బెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో బిడిఎస్,చెన్నె మీనాక్షి దంతవైద్య కళాశాలలో ఎండిఎస్
ను చదివి డాక్టర్ పట్టాను అందుకున్నారు.అనంతరం 2004 తక్కెళ్ళపాడు సిబార్ దంతవైద్య కళాశాలలో అధ్యా
పకురాలిగా విద్యను అందిస్తూ వస్తున్నారు.అనేక విభాగాలకు ఆమె అధిపతిగా పనిచేస్తూ వస్తున్నారు.కేంద్ర వైద్య
ఆరోగ్యశాఖలకు అనేక వినూత్న సలహాలను అందిస్తూ తన సేవలను కొనసాగించారు.క్రమశిక్షణ,అంకితభావం,ని
బద్ధత కలిగిన వైద్యురాలిగా ఆమెకు మంచిగుర్తింపు ఉంది.రేవతి ఎంపికపట్ల దేశవ్యాప్తంగా అనేకమంది అతిధులు
ఆమెకు అభినందనలు తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లింగమనేని కృష్ణప్రసాద్,చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్
సుబ్బారావు,డైరక్టర్ డాక్టర్ టి.కృష్ణమోహన్,వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారెడ్డి,అధ్యాపకులు,ఫ్రొఫెసర్లు,విద్యార్థులు
రేవతికి శుభాకాంక్షలు తెలియజేశారు.