భాగ్యనగరంలో ‘సాహో’

PRABHAS-1
PRABHAS-1

భాగ్యనగరంలో ‘సాహో’

ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం సాహో.. ముందుగా యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కోసం దుబాయిలోని , బుర్జ్‌ ఖలీఫా వద్ద చిత్రీకరణ జరపాలని చేసిన సంగతి తెలిసిందే.. కానీ అనుమతికి ఆలస్యమవుతున్న కారణంగా ఆ షెడ్యూల్‌ను పక్కనబెట్టి హైదరాబాద్‌ షెడ్యూల్‌కు సిద్ధమైంది టీం.. ఈ షెడ్యూల్‌ నేటి నుంచి మొదలు కానుంది. ప్రభాస్‌తోపాటు ముఖ్యతారాగణమంతా ఈషెడ్యూల్‌లో పాల్గొనున్నారు.. ఈనెలాఖరు వరకు ఈ షెడ్యూల్‌ జరుగుతుంది.. శ్రద్ధాకపూర హీరోయిన్‌గా నటిస్తున్నఈ చిత్రానికి బాలవుడ్‌ త్రయం శంకర్‌, ఈషాన్‌, లో§్‌ులు సంగీతం అందిస్తున్నారు.. సుజీత్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈచిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.