భాగమతి రెడీ అవుతోంది!

భాగమతి ..రెడీ అవుతోంది!
అనుష్క ఈ ఏడాది తన అభిమానులను అలరించడానికి రెడీ అవుతోంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా తెరపైకి వస్తుండటంతో, వాళ్లంతా సంతోషంతో పొంగిపోతున్నారు. సింగం 3.. ఓం నమో వేంకటేశాయ.. బాహుబలి 2 సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే భాగమతి సినిమా విడుదలకి ముస్తాబవుతుండటం విశేషం. అశోక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్, షూటింగ్ పార్ట్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమాను, ఆగస్టు రెండో వారంలో థియేటర్స్ కి తీసుకురానున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.